ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మూడో తేదీ తరువాతే రాజధానిపై నిర్ణయం - లైవ్ అప్​డేట్స్: సచివాలయంలో మంత్రివర్గం భేటీ

సచివాలయంలో మంత్రివర్గం భేటీ
సచివాలయంలో మంత్రివర్గం భేటీ

By

Published : Dec 27, 2019, 11:13 AM IST

Updated : Dec 27, 2019, 3:08 PM IST

14:32 December 27

బీసీజీ నివేదిక తర్వాతే రాజధానిపై నిర్ణయం!

రాజధాని అంశంపై తుది నిర్ణయం తీసుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. బోస్టన్‌ కన్సల్టింగ్ గ్రూప్‌( బీసీజీ) నివేదిక తర్వాత రాజధాని అంశంపై స్పష్టత రానుంది. రాజధానిపై జనవరి 3న  బీసీజీ నివేదిక అందజేయనుంది. అనంతరం జనవరి మూడో వారంలో శాసనసభ సమావేశాలు నిర్వహించి అక్కడ ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశముంది.

14:32 December 27

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం వివరాలను సమాచారా శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు మంత్రి తెలిపారు. మచిలీపట్నం పోర్టును రాష్ట్ర  ప్రభుత్వమే నిర్మిస్తుందని ఆయన స్పష్టం చేశారు. కొత్తగా 108 వాహనాలు కొనుగోలుకు కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. 412 వాహనాల కొనుగోలుకు రూ.78కోట్లు కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాజధానిపై గత ప్రభుత్వం చేసిన తప్పులను మంత్రివర్గ ఉప సంఘం గుర్తించిందని నాని తెలిపారు. దీనిపై న్యాయ నిపుణుల సలహా మేరకు నిర్ణయాలు ఉంటాయన్నారు. ఈ వ్యవహారాన్ని లోకాయుక్త, సీబీఐ, సీబీసీఐడీలో దేనిక అప్పగించాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాజధానిపై జీఎన్‌ రావు కమిటీ  ఇచ్చిన నివేదికపై మంత్రివర్గంలో చర్చించామని తెలిపారు. రాజధాని పట్టణీకరణపై బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూపు నివేదిక ఇంకా అందాల్సి ఉందని.. ఆ రెండు నివేదికలపై నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు.

13:30 December 27

లైవ్ అప్​డేట్స్: మూడో తేదీ తరువాతే రాజధానిపై నిర్ణయం

రాజధాని అంశంపై మంత్రివర్గంలో చర్చించాం: మంత్రి కన్నబాబు
జీఎన్‌ రావు కమిటీపై మంత్రివర్గంలో చర్చించాం: మంత్రి కన్నబాబు
బీసీజీ నివేదిక ఇంకా రావాల్సి ఉంది: మంత్రి కన్నబాబు
బీసీజీ నివేదిక అందాక ఏంచేయాలన్న అంశంపై ఆలోచిస్తున్నాం: కన్నబాబు
మీడియా సమావేశంలో మంత్రి పేర్ని నాని మిగతా వివరాలు వెల్లడిస్తారు: కన్నబాబు
 

12:46 December 27

రాజధానిలో గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, నిర్మాణాలపై నివేదిక

రాజధానిలో గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, నిర్మాణాలపై నివేదిక

నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన మంత్రివర్గ ఉపసంఘం

ఆర్థికమంత్రి బుగ్గన ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం

దాదాపు4నెలల పాటు వేర్వేరు సందర్భాల్లో సమావేశమై నివేదిక

10:28 December 27

మూడో తేదీ తరువాతే రాజధానిపై నిర్ణయం

ఏపీ మంత్రివర్గ సమావేశం సచివాలయంలో ప్రారంభమైంది.  ముఖ్యమంత్రి Y.S. జగన్‌తో సహా మంత్రులు, అధికారులు సమావేశానికి హాజరయ్యారు. అక్టోపస్ దళాల భద్రత మధ్య CM సచివాలయానికి చేరుకున్నారు.  మందడం వద్ద రైతుల ఆందోళనల దృష్ట్యా సీఎం వచ్చే మార్గాన్ని మళ్లించారు. సీడ్ ఆక్సిస్ రోడ్డు నుంచి మరో మార్గంలో సీఎం కార్యాలయానికి చేరుకున్నారు.

Last Updated : Dec 27, 2019, 3:08 PM IST

ABOUT THE AUTHOR

...view details