ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'జగన్ సమీక్షలు చేస్తుంటే.. చంద్రబాబు పక్క రాష్ట్రంలో ఉండి విమర్శిస్తున్నారు' - అనంతపురంలో మంత్రి శంకరనారాయణ వార్తలు

కరోనా నియంత్రణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి శంకరనారాయణ చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ కొవిడ్ కట్టడికి సమీక్షలు చేస్తుంటే.. తెదేపా అధినేత చంద్రబాబు మాత్రం విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకున్నా కొన్ని మీడియా సంస్థలు పని కట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.

minister shankernarayana
minister shankernarayana

By

Published : May 7, 2021, 7:38 PM IST

రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం సీఎం జగన్‌ రోజుకు 5 గంటలు సమీక్షిస్తుంటే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం పక్క రాష్ట్రంలో ఉంటూ విమర్శలు చేస్తున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడా ఆక్సిజన్‌ కొరత లేకున్నా కొన్ని పత్రికలు, వార్తఛానళ్లు కావాలని దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా అనంతపురంలో ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు.

జిల్లాలో ఇటీవల ఆక్సిజన్‌ కొరతతో కరోనా రోగులు చనిపోయినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. జిల్లాలో సరిపడా ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయన్నారు. నిముషానికి వెయ్యి లీటర్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసే 4 ప్లాంట్లను రాష్ట్ర ప్రభుత్వం... జిల్లాకు మంజూరు చేసిందన్నారు కలెక్టర్ గంధం చంద్రుడు చెప్పారు. రెండు, మూడు నెలల్లో వాటి నిర్మాణం పూర్తవుతుందన్నారు. అనంతపురం సూపర్‌ స్పెషాలిటీ, హిందూపురం, గుంతకల్లు, కదిరిలో వీటిని నిర్మించనున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details