ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సాయంత్రంలోపు బస్సులు తిప్పే అంశంపై నిర్ణయం' - latest news of apsrtc

రాష్ట్రంలో బస్సులు తిప్పే విషయమై ఇవాళ సాయంత్రం 4 గంటలలోపు సీఎం జగన్ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని మంత్రి పేర్ని నాని తెలిపారు.

minister perni nani
minister perni nani

By

Published : May 18, 2020, 1:30 PM IST

మంత్రి పేర్నినానితో ముఖాముఖి

ప్రజా రవాణా వాహనాలను నడిపే విషయమై ఇవాళ సాయంత్రం లేదా రేపు సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని రవాణా శాఖ మంత్రి పేర్నినాని తెలిపారు. సీఎం నుంచి ఆదేశాలు రాగానే బస్సులు తిప్పేందుకు ఆర్టీసీ సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేలా బస్టాండ్లు, బస్సుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడతామన్నారు. బస్సు ఎక్కే ప్రతి ప్రయాణికుడు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, శానిటైజర్లను తప్పక వినియోగించే నిబంధన అమలు చేస్తామని స్పష్టం చేశారు.

కండక్టర్లు లేకుండా బస్సులు తిప్పే ప్రతిపాదనను ముఖ్యమంత్రి పరిశీలనలో ఉందని...ఆమోదిస్తే ప్రయోగాత్మకంగా కొన్ని విజయవాడ, విశాఖలో ప్రారంభించి క్రమంగా పెంచుతామన్నారు. చార్జీలు పెంచే ఆలోచన లేదని తెలిపారు. ఆర్టీసీకి ఎంత భారమైనా ప్రజాహితం కోసం ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఆర్టీసీలో అవుట్ సోర్సింగ్ కార్మికులను ఎవరినీ తొలగించడం లేదని ఈటీవీ భారత్ ముఖాముఖిలో స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details