ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాజధానిపై మంత్రి బొత్స వ్యాఖ్యలు సరైనవే'

గత కొన్ని రోజులుగా రాజధాని అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బొత్స వ్యాఖ్యలను పలు పార్టీల నేతలు తప్పుపడుతుండగా.. ఆయన బాధ్యతాయుతమైన వ్యాఖ్యలే చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని తెలిపారు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

By

Published : Aug 31, 2019, 8:25 PM IST

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు బాధ్యతాయుతమైనవేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమర్ధించారు. పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఇసుక తవ్వకాలపై గత ప్రభుత్వాన్ని ఎన్‌జీటీ తప్పుపట్టిందన్న పెద్దిరెడ్డి... తాము పారదర్శక విధానాన్ని తీసుకువస్తున్నామని వివరించారు. ఇసుక ద్వారా గత ప్రభుత్వంలో వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.

ఆనాడు దోచుకున్నవాళ్లే నేడు తమ ప్రభుత్వంపై రాళ్లేస్తున్నారని విమర్శించారు. ఇసుక తవ్వకాలను నియంత్రించామన్న మంత్రి... అర్హులకు సరఫరా ఆపలేదని స్పష్టం చేశారు. ఇసుక తవ్వకం అడ్డుకున్న అధికారులను తెదేపాలా అవమానించలేదని గుర్తుచేశారు. వచ్చే నెల 5 నుంచి తీసుకువచ్చే విధానాన్ని ప్రజలు హర్షిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఉగాదికి 25 లక్షల ఇంటిపట్టాలు ఇవ్వాలనేది ప్రభుత్వ యోచనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

ఇదీ చదవండీ... 'దేవాలయాల భూములు కొట్టేసేందుకు కుట్ర'

ABOUT THE AUTHOR

...view details