ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మాధవరెడ్డి దగ్గరున్న కారు స్టిక్కర్​ నాదే.. అయితే దానికి నాకేం సంబంధం' - మాధవరెడ్డి

Mallareddy on Casino Issue: క్యాసినో వ్యవహారంలో మాధవరెడ్డి ఇంట్లో దొరికిన ఎమ్మెల్యే కారు స్టిక్కర్​పై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. తన ఎమ్మెల్యే కారు స్టిక్కర్​ మాధవరెడ్డి ఇంట్లో ఎందుకుందనే విషయమై వివరణ ఇచ్చారు.

Mallareddy on Casino Issue
Mallareddy on Casino Issue

By

Published : Jul 28, 2022, 8:00 PM IST

Mallareddy on Casino Issue: క్యాసినో వ్యవహారంలోని నిందితుడైన మాధవరెడ్డి ఇంట్లో జరిగిన సోదాల్లో దొరికిన కారు స్టిక్కర్​పై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. క్యాసినోలు నిర్వహిస్తూ ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి అనే ఇద్దరు వ్యక్తుల ఇళ్లల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఐఎస్ సదన్‌కు చెందిన ప్రవీణ్, బోయిన్‌పల్లిలో నివాసం ఉంటున్న మాధవరెడ్డితో పాటు పలువురు ఏజెంట్ల ఇళ్లల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో మాధవరెడ్డి కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్​ ఉన్నట్టు.. అది మంత్రి మల్లారెడ్డికి సంబంధించినదిగా అధికారులు గుర్తించారు.

మేడ్చల్ జిల్లా బోడుప్పల్​లోని జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు రాత పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి.. ఎమ్మెల్యే స్టిక్కర్​ విషయంపై వివరణ ఇచ్చారు. మాధవరెడ్డి ఇంట్లో జరిగిన సోదాల్లో దొరికిన స్టిక్కర్ తనదేనని మంత్రి స్పష్టం చేశారు. అయితే.. ఆ స్టిక్కర్​ మాత్రం మార్చి 2022 నాటిదని పేర్కొన్నారు. దాన్ని మూడు నెలల క్రితమే తీసేసి బయట పడేశామని.. అది ఎవరో పెట్టుకుంటే తనకేం సంబంధమని మంత్రి మల్లారెడ్డి ప్రశ్నించారు.

'మాధవరెడ్డి దగ్గరున్న కారు స్టిక్కర్​ నాదే.. అయితే దానికి నాకేం సంబంధం'

"ఆ స్టిక్కర్​ నాదే. అది మార్చి 2022 నాటిది. నాక్కూడ తెలువదు. మీడియా ద్వారానే తెలిసింది. నేను మూడు నెలల కిందనే పడేస్తే.. ఎవరైనా తీసి పెట్టుకోవచ్చు. దానికి నాకేం సబంధం ఉంటుంది." - మల్లారెడ్డి, మంత్రి

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details