ఏపీ మాక్స్ చట్టంతో పాటు ఇతర సహకార చట్టాల్లో సవరణలకు సంబంధించి అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కన్నబాబు అధికారులను ఆదేశించారు. సహకార శాఖ పూర్తి కంప్యూటరీకరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విజయవాడలోని అప్కాబ్ భవన్లో సహకార బ్యాంకుల పనితీరుపై సమీక్షించిన మంత్రి.. కంప్యూటరీకరణకు గడువు నిర్దేశించుకోవాలని సూచించారు. సహకార సంఘాలను బలోపేతం చేయటం, నిధుల దుర్వినియోగానికి తావులేకుండా నిరంతర ఆడిట్ విధానం అనుసరించాలని మంత్రి సూచనలు చేశారు. అభియోగాలు, ఆరోపణలు నిరూపణ అయితే తక్షణం క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సహకార శాఖ పూర్తి కంప్యూటరీకరణ జరగాలి: కన్నబాబు - minister kurasala kannababu latest news
సహకార బ్యాంకుల పనితీరుపై మంత్రి కురసాల కన్నబాబు సమీక్ష నిర్వహించారు. సహకార శాఖ పూర్తి కంప్యూటరీకరణకు మంత్రి కన్నబాబు ఆదేశించారు. కంప్యూటరీకరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సహకార సంఘాలను బలోపేతం చేయాలని మంత్రి సూచించారు. నిధుల దుర్వినియోగానికి తావులేకుండా ఆడిట్ జరగాలని స్పష్టం చేశారు. అభియోగాలు నిరూపణ అయితే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏపీ మాక్స్ చట్టం, సహకార చట్టాల్లో సవరణలపై అధ్యయనం చేయాలని సూచించారు.
కన్నబాబు
TAGGED:
కురసాల కన్నబాబు తాజా వార్తలు