దేశంలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని... ఆ దిశగా కేంద్రం ముందుకెళ్తోందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. జమిలి ఎన్నికలకు అప్రమత్తమై సిద్ధంగా ఉండాలని పార్టీ క్యాడర్‌కు సూచించారు. తెలంగాణ భవన్లో జీహెచ్ఎంసీ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నూతనంగా ఎన్నకైన కార్పొరేటర్లు మంత్రిని కేటీఆర్‌ను కలిశారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఫలితాలపై నిరాశ చెందొద్దని కేటీఆర్ నాయకులతో అన్నారు. గెలుపు ఓటములు సహజమని చెప్పారు. ఎప్పటిలాగే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళదామని సూచించారు. సిట్టింగ్‌లకే టికెట్లు ఇచ్చే విషయంలో కొంత ఆలోచన చేయాల్సిందని... అందుకే ఇలాంటి ఫలితం వచ్చిందని అన్నారు.
సిట్టింగ్‌లను మార్చిన పార్టీ అభ్యర్థులు గెలిచినట్లు కేటీఆర్ చెప్పుకొచ్చారు. మార్చని చోట సిట్టింగ్ కార్పొరేటర్లు చాలామంది ఓడిపోయారని... అక్కడే లెక్క తప్పిందన్నారు. సాధారణ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి రిపీట్ అయ్యే ప్రమాదం ఉందని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు లోపాలు సరిదిద్దుకోవాలని కేటీఆర్ సూచన చేశారు.