ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'చంద్రబాబుకు బషీర్ ​బాగ్ కాల్పులు గుర్తులేవా?'

విద్యుత్ అంశాలపై తెదేపా అధినేత చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. విద్యుత్ సంస్కరణలకు ఆద్యుడు చంద్రబాబేనని గుర్తు చేశారు. గతంలో రాత్రిపూట కరెంటు ఇస్తే ఇప్పుడు పగటి పూట 9 గంటల విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. చంద్రబాబుకు బషీర్​బాగ్ కాల్పులు గుర్తు లేనట్టుందని వ్యాఖ్యానించారు.

minister-kannababu-fires-on-chandrababu-over-power-reforms
కన్నబాబు

By

Published : Sep 6, 2020, 12:12 AM IST

వ్యవసాయానికి ఉచిత విద్యుత్ గురించి తెదేపా అధినేత చంద్రబాబు ఎప్పుడు పోరాటం చేశారో చెప్పాలని... వ్యవసాయశాఖ మంత్రి కన్నాబాబు డిమాండ్ చేశారు. విద్యుత్ అంశాలపై ఆయన గతాన్ని గుర్తు చేసుకోవాలని, అప్పటి నుంచే రాష్ట్రంలో ప్రజలకు విద్యుత్ బిల్లులు కట్టలేని పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. బషీర్​బాగ్ కాల్పులు, ఏలూరులో లాఠీఛార్జి, విద్యుత్ సౌధ, జిల్లా కలెక్టరేట్ల ముట్టడుల వంటి ఘటనలు ఆయనకు గుర్తు లేనట్టుందని కన్నబాబు వ్యాఖ్యానించారు.

గతంలో రాత్రి పూట కరెంటు ఇస్తే ఇప్పుడు పగటి పూట 9 గంటల విద్యుత్ ఇస్తున్నామని మంత్రి కన్నబాబు తెలిపారు. విద్యుత్ నగదు బదిలీ పథకంతో రైతులపై ఎలాంటి భారం పడదని ప్రభుత్వం స్పష్టంగా చెబుతుందన్నారు. విద్యుత్ సంస్కరణల పేటెంట్ హక్కు తెదేపాదని చంద్రబాబు చెబుతున్నారని... తన ప్రభుత్వ హయాంలో రైతులకు బేడీలు ఎందుకు వేయించారని నిలదీశారు. విద్యుత్ అంశాలపై చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. అమరావతిలో చంద్రబాబు సొంత సంపదను సృష్టించుకున్నారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details