ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 30, 2020, 4:59 PM IST

ETV Bharat / city

భాజపాలో చేరుతానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు: హరీశ్‌రావు

నాలుగు ఓట్లు వస్తాయన్న ఆశతో సామాజిక మాధ్యమాల్లో తనపై భాజపా తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఎన్నికల సంఘం కార్యాలయం ముందు భాజపా ధర్నా డ్రామా అని ఆయన అభివర్ణించారు.

minister-harish-rao
minister-harish-rao

అసత్య వార్తలను ప్రచారం చేయడంలో భాజపాకు నోబెల్ బహుమతి వస్తుందని తెలంగాణ మంత్రి హరీశ్​ రావు ఎద్దేవా చేశారు. వారి అధినాయకత్వం మొత్తం వచ్చినా.. హైదరాబాద్ ప్రజలు మొగ్గు చూపకపోవడంతో భాజపా ఆందోళనకు గురవుతోందని విమర్శించారు.

తాను, తమ పార్టీ ముఖ్య నేతలు భాజపాలో చేరుతున్నట్లు తప్పుడు వీడియోలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇతర దేశాల్లో, రాష్ట్రాల్లో గతంలో జరిగిన మత కల్లోలాలు, ప్రార్థన మందిరాల్లో మాంసం వేయడం వంటి వీడియోలు.. మళ్లీ ఇక్కడ జరిగినట్టు తప్పుడు ప్రచారం చేయబోతున్నట్లు తమకు సమాచారం ఉందని ఆయన తెలిపారు.

ఓట్లు వస్తాయన్న ఆశతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం పెంచేలా.. ఎన్నికల ప్రచారం చేయాలి కానీ.. భాజపా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.

భాజపా సృష్టించే తప్పుడు ప్రచారాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భాజపా దాడులకు కూడా పాల్పడే అవకాశం ఉందన్నారు. పార్టీ శ్రేణులు సంయమనంతో ఉండాలని హరీశ్​ సూచించారు.

ఇదీ చూడండి:

కర్నూలు: ఓంకారం పుణ్యక్షేత్రంలో అర్చకులపై ఆలయ ఛైర్మన్ దాడి

ABOUT THE AUTHOR

...view details