ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 22, 2020, 5:20 PM IST

Updated : Sep 22, 2020, 6:04 PM IST

ETV Bharat / city

కేంద్రం డబ్బుల కోసం జగన్ ఆశపడ్డారు : హరీశ్​ రావు

కేంద్ర ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేస్తుందని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. రైతులకు నష్టం కలిగించే బిల్లులను ప్రవేశపెట్టిందన్నారు. ఇటీవల జరిగిన ఆర్థిక మంత్రుల సమావేశంలో బోర్లు, బావులకు మీటర్లు పెడితే డబ్బులు ఇస్తామన్నారు. మన కేసీఆర్ రైతులు గురించి ఆలోచించి వద్దు అన్నారు. పక్కనున్న జగన్మోహన్ రెడ్డి ఆశపడి పైసలు తీసుకుని మోటర్లు పెడుతున్నారన్నారు.

హరీశ్​ రావు
హరీశ్​ రావు

'కేంద్రం పైసలిస్తనంటే కేసీఆర్ వద్దన్నారు.. జగన్​ ఆశపడ్డారు'

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఆ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పర్యటించారు. ఈ పర్యటనలో మాట్లాడిన ఆయన.. కేంద్ర ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేసిందని వ్యాఖ్యానించారు.

''ఇటీవల ఆర్థిక మంత్రులకి మీటింగ్ అయ్యింది. మీకు రూ.2,500 కోట్లు కావాలంటే... బావులు, బోర్ల వద్ద మీటర్లు పెట్టండి అన్నారు. పెట్టాల్నా మరీ..? పెట్టి 2,500 కోట్ల రూపాయలు తెచ్చుకోవాల్నా? అదే మన పక్కన ఆంధ్రప్రదేశ్​లో సీఎం జగన్​మోహన్ రెడ్డికి రూ.4,000 కోట్లు ఆఫర్ ఇచ్చారు. పోయిండు. నాలుగు వేల కోట్లు తెచ్చుకున్నాడు. మీటర్లు పెడుతున్నాడు.''

-మంత్రి హరీశ్ రావు

తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం కేంద్రం ఇచ్చిన ఆఫర్ వద్దని రైతుల క్షేమమే ముఖ్యమన్నారని హరీశ్​రావు తెలిపారు. కోట్లు వద్దు... మీటర్లు వద్దని కేసీఆర్ అంటే.. కేంద్రం డబ్బుల కోసం జగన్​ ఆశపడ్డారని మంత్రి వెల్లడించారు.

ఇదీ చూడండి:'ఆ ఎంపీలు క్షమాపణ చెబితేనే వేటుపై పునరాలోచన'

Last Updated : Sep 22, 2020, 6:04 PM IST

ABOUT THE AUTHOR

...view details