28 రోజుల తర్వాత రెండవ డోసు..
తెలంగాణ: 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది: ఈటల - corona vaccine latest news
ఈ నెల 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి ఈటల వెల్లడించారు. ముందుగా కరోనా సమయంలో సేవలందించిన సిబ్బందికి వ్యాక్సిన్ అందిచనున్నట్టు తెలిపారు.
ఈ నెల 16 నుంచి మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 139 సెంటర్లలో కరోనా సమయంలో ముందుండి సేవలందించిన సిబ్బందికి వ్యాక్సిన్ వేసే కార్యక్రమం మొదలవుతుందని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. 50 ఏళ్లు పైబడిన వారితో పాటు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి కూడా ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. మొదటి డోసు వేసిన వారికి 28 రోజుల తర్వాత రెండవ డోసు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రానికి ఇప్పటివరకు 3,64,000 కరోనా టీకా డోసులు వచ్చాయని వివరించారు.
ఇదీ చదవండి:కరోనా.. ఇక సాధారణ జలుబు కారకమే!