కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కలిశారు. రాష్ట్రంలో భారత్ నెట్ పనులను వేగవంతం చేయాలని ఆయన కోరారు. ప్రతి గ్రామాన్ని అంతర్జాలంతో అనుసంధానించాల్సి ఉందని బుగ్గన పేర్కొన్నారు.
పీపీపీ పద్దతిలో పనులను మెుదలు పెట్టాలని విన్నవించారు. రాష్ట్రంలో ఎస్సీ కమిషన్ ఏర్పాటుకు ఆమోదం తెలపటంతో పాటు జాతీయ లా వర్సిటీ ఏర్పాటు చేయాలని.. కేంద్ర మంత్రిని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కోరారు.