హైకోర్టు నోటీసులకు సమాధానమిస్తా: మంత్రి బొత్స హైకోర్టు నోటీసులపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. కోర్టు ఆదేశాలు తప్పకుండా పాటిస్తానని స్పష్టం చేశారు. ఎస్ఈసీ వేసిన కేసులో ఇచ్చిన నోటీసుకు సమాధానమిస్తామన్నారు. నిమ్మగడ్డ రహస్యాలు బయటికేం వచ్చాయో తనకు తెలియదని చెప్పారు. ఆయనైనా, తనైనా హక్కులతో పాటు బాధ్యతలు గుర్తెరగాలని వ్యాఖ్యానించారు.
అసలేం జరిగిందంటే...
గవర్నర్‌తో ఉత్తర ప్రత్యుత్తరాల లీక్‌పై సీబీఐ విచారణ జరిపించాలని ఎస్ఈసీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై న్యాయస్థానం విచారణ జరిపింది. ప్రివిలేజ్ లెటర్స్ లీక్ అవలేదని గవర్నర్ సెక్రటరీ చెప్పారని ఎస్‌ఈసీ న్యాయవాది వివరించారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు... మంత్రులు బొత్సతో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి హైకోర్టు వాయిదా వేసింది.
ఇదీ చదవండి
మంత్రులు బొత్స, పెద్దిరెడ్డికి హైకోర్టు నోటీసులు