ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రుషికొండలో పాత హోటల్ స్థానంలో కొత్తది కడితే తప్పేంటి?: బొత్స - రుషికొండ

BOTSA ON RUSHIKONDA : రుషికొండపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పలు వ్యాఖ్యలు చేశారు. పాత హోటల్ స్థానంలో కొత్త హోటల్ కడితే తప్పేంటని ప్రశ్నించారు. రుషికొండలో సక్రమంగానే నిర్మాణాలు జరుగుతున్నాయని.. అవసరమైతే అఖిలపక్షాలను రుషికొండ తీసుకెళ్లి చూపిస్తామన్నారు.

BOTSA ON RUSHIKONDA
BOTSA ON RUSHIKONDA

By

Published : Sep 29, 2022, 7:21 PM IST

MINISTER BOTSA : రుషికొండలో పాత హోటల్ స్థానంలో కొత్త హోటల్ కడితే తప్పేంటని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆ స్థలంలో ప్రభుత్వ కార్యాలయాలు, సీఎం కార్యాలయం కడితే తప్పేంటన్నారు. రుషికొండలో సక్రమంగానే నిర్మాణాలు జరుగుతున్నాయని.. అవసరమైతే అఖిలపక్షాలను తీసుకెళ్లి చూపిస్తామన్నారు. అమరావతి రైతుల యాత్ర ముసుగులో తెదేపా యాత్ర చేస్తోందని.. తెదేపా నేతలే నేరుగా యాత్ర చేయొచ్చు కదా అని నిలదీశారు. అమరావతి రైతుయాత్రలో మాట్లాడుతున్న వ్యక్తి స్థిరాస్తి వాపారి కాదా అని ప్రశ్నించారు. మేము విశాఖను దోచుకోవాలంటే ఎప్పుడో సగం మా జేబులో ఉండేదని.. దేవుడి దయ వల్ల మా తాతలు, తండ్రి ఇచ్చిన ఆస్తి ఉందన్నారు. ఇంటర్ చదివే రోజుల్లోనే అంబాసిడర్‌ కారులో తిరిగే వాడినని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details