భాజపా, జనసేన ప్రకటించిన పాదయాత్రకు.. ఔచిత్యం ఏముందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత ప్రతిపక్ష పార్టీలకు లేదన్నారు. పార్లమెంటులో ప్రకటించిన విభజన హామీల గురించి మర్చిపోయిన.. భాజపా ఏం మాట్లాడుతుందని ప్రశ్నించారు. వైకాపాకు ప్రజా మద్దతు ఉందని స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. త్వరలోనే రాజధానిని విశాఖకు తరలిస్తామని మంత్రి పునరుద్ఘాటించారు.
విభజన హామీలను మర్చిపోయిన భాజపా ఏం మాట్లాడుతుంది: మంత్రి బొత్స - మంత్రి బొత్స తాజా వార్తలు
విభజన హామీలను అమలు చేయని భాజపా.. ఏం మాట్లాడుతుందని మంత్రి బొత్స ప్రశ్నించారు. ఆ పార్టీ నేతలు చేసే వాగ్దానాలను ప్రజలు నమ్మరని విమర్శించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత ప్రతిపక్ష పార్టీలకు లేదన్నారు.
మంత్రి బొత్స సత్యనారాయణ