రాజధాని మార్చాలన్నది తమ అభిమతం కాదని... రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ ఆలోచన చేస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు. విజయనగరంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం రాజధాని అంశంపై ఆయన మాట్లాడారు. ఏ ప్రాంతం, ఏ ఒక్కరిపై తమకు ద్వేషం లేదని స్పష్టం చేశారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని బొత్స ఉద్ఘాటించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధిపై ప్రతిపక్షాల విధానమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజధాని ఎక్కడున్నా సమస్యలేదు...కానీ.. - రాజధానిపై మంత్రి బొత్స కామెంట్స్
రాజధానిని మార్చాలన్నది తమ అభిమతం కాదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
minister bosta comments on capital city change in vizianagaram
ఇదీ చదవండి : 'సీఎం ఆదేశాల మేరకే అన్నీ జరుగుతున్నాయి'