నిబంధనల గురించి యనమల రామకృష్టుడు మాట్లాడటం సబబు కాదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ప్రజామద్దతు లేని వ్యవస్థలు దండగని గతంలోనే ఎన్టీఆర్ చెప్పారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఉన్నది జనగ్ మోక్రసి కాదు... జన మోక్రసి అని చెప్పారు. వైకాపా ప్రభుత్వం తప్పు చేస్తే 2024లో ప్రజలు తీర్పు ఇస్తారని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి తెదేపా సహకరించకపోయినా ఫర్వాలేదన్నారు. అభివృద్ధిని అడ్డుకుంటే సహించబోమని హెచ్చరించారు. మంత్రులు తాగి వచ్చారంటూ యనమల అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తన రక్త నమూనా ఇచ్చి పరీక్షలకు సిద్ధమని అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు.
'రాష్ట్రంలో జగన్ మోక్రసి కాదు... జన మోక్రసి ఉంది'
శాసన మండలి రద్దు చేయాలా వద్దా అనేది ప్రభుత్వ విచక్షణ అధికారమని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ప్రజా మద్దతు లేని వ్యవస్థ అవసరం లేదని గతంలో ఎన్టీఆర్ చెప్పారన్న ఆయన... రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ నిర్ణయం ఉంటుందన్నారు. మంత్రులు తాగి వచ్చారంటూ తెదేపా చేసిన వ్యాఖ్యలను మంత్రి అనిల్ ఖండించారు.
మంత్రి అనిల్ కుమార్ యాదవ్