ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పదో తరగతి పరీక్షలు నిర్వహించలేకపోతున్నాం: ఆదిమూలపు సురేష్

దేశ వ్యాప్తంగా మే 3 వరకు లాక్​డౌన్ పొడిగించటం వల్ల 10వ తరగతి పరీక్షలు నిర్వహించలేకపోతున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. సప్తగిరి ఛానల్ ద్వారా విద్యార్థులకు రోజుకు 2 గంటల చొప్పున పాఠాలు బోధిస్తున్నామన్నారు. ఈ పాఠాలు సప్తగిరి యూట్యూబ్ ఛానల్​లోనూ అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.

Minister adimulapu suresh
ఆదిమూలపు సురేష్

By

Published : Apr 14, 2020, 4:03 PM IST

పదో తరగతి పరీక్షల నిర్వహణపై మాట్లాడుతున్న మంత్రి ఆదిమూలపు సురేష్

మే 3 వరకు లాక్​డౌన్ పొడిగింపు దృష్ట్యా పదో తరగతి పరీక్షలు ప్రస్తుతం నిర్వహించలేకపోతున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పరీక్షలు జరిగేంత వరకు విద్యార్థులకు సప్తగిరి ఛానల్ ద్వారా పాఠాలు బోధిస్తామన్నారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి 11 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు పాఠాలు ప్రసారం అవుతాయని మంత్రి వివరించారు. ఆ పాఠాలు యూట్యూబ్ సప్తగిరి ఛానల్​లోనూ అందుబాటులో ఉంచుతామన్నారు.

విద్యామృతం పేరుతో కార్యక్రమం రూపొందించామని, అందుకుగాను అన్ని శాఖల పరిధిలోని పాఠశాలల నుంచి అధ్యాపకులను ఎంపిక చేసినట్లు మంత్రి చెప్పారు. విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా తరగతులను వినియోగించుకోవాలన్నారు. ఆన్​లైన్​లో చెప్పడానికి ఉత్సాహం ఉన్న ఉపాధ్యాయలు ముందుకురావచ్చని మంత్రి కోరారు.

ABOUT THE AUTHOR

...view details