- అచ్చంపేట మున్సిపల్ ఛైర్మన్ పీఠం తెరాస కైవసం
- అచ్చంపేటలో మొత్తం 20 వార్డుల్లో 13 తెరాస కైవసం
- అచ్చంపేటలో ఆరు వార్డులు గెలుచుకున్న కాంగ్రెస్
- అచ్చంపేటలో ఒక వార్డు గెలుచుకున్న భాజపా
లైవ్ అప్డేట్స్: తెలంగాణ మినీ పురపోరు.. అచ్చంపేట మున్సిపల్ ఛైర్మన్ పీఠం తెరాస కైవసం - తెలంగాణలో ఎన్నికల ఫలితాలు
14:06 May 03
13:15 May 03
- నకిరేకల్ మున్సిపల్ ఛైర్మన్ పీఠం తెరాస కైవసం
- నకిరేకల్‌లో మొత్తం 20 వార్డులో 11 తెరాస కైవసం
- నకిరేకల్‌లో 6 వార్డులు గెలుచుకున్న ఫార్వర్డ్ బ్లాక్
- నకిరేకల్‌లో రెండు స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్
- నకిరేకల్‌లో ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం
13:06 May 03
నల్గొండ 26వ వార్డు ఉపఎన్నికలో తెరాస విజయం
తెరాస అభ్యర్థి సుల్తానా 999 ఓట్ల మెజార్టీతో గెలుపు
13:06 May 03
- రంగారెడ్డి: కొత్తూరు మున్సిపాలిటీ తెరాస కైవసం
- కొత్తూరులో మొత్తం 12 వార్డుల్లో 7 తెరాస కైవసం
- కొత్తూరులో ఐదు వార్డులు గెలుచుకున్న కాంగ్రెస్
12:16 May 03
జడ్చర్ల మున్సిపాలిటీని కైవసం చేసుకున్న తెరాస
- జడ్చర్ల మున్సిపాలిటీని కైవసం చేసుకున్న తెరాస
- జడ్చర్లలో 27 వార్డుల్లో ఇప్పటివరకు 19 వార్డుల్లో లెక్కింపు పూర్తి
- జడ్చర్లలో ఫలితాలు వెలువడిన 19 వార్డుల్లో 16 చోట్ల తెరాస గెలుపు
11:49 May 03
కాంగ్రెస్ విజయం
- జీహెచ్‌ఎంసీ పరిధిలో లింగోజిగూడ డివిజన్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపు
- భాజపా కార్పొరేటర్ మృతితో లింగోజిగూడ డివిజన్ ఉపఎన్నిక
- భాజపా అభ్యర్థిపై పోటీకి అభ్యర్థిని నిలపని తెరాస
- లింగోజిగూడ డివిజన్‌ను కైవసం చేసుకున్న కాంగ్రెస్
- గ్రేటర్ హైదరాబాద్‌లో 3 స్థానాలకు పెరిగిన కాంగ్రెస్ బలం
10:39 May 03
- గజ్వేల్-ప్రజ్ఞాపూర్ 12వ వార్డు ఉపఎన్నికలో తెరాస విజయం
10:34 May 03
- నిజామాబాద్: బోధన్ 18వ వార్డు ఉపఎన్నికలో తెరాస విజయం
10:33 May 03
ఖమ్మం ఫలితాలు ఇలా..
- ఖమ్మం 1, 10, 13, 25, 37 డివిజన్లలో తెరాస విజయం
- ఖమ్మం 49, 55 డివిజన్లలో కాంగ్రెస్ విజయం
- ఖమ్మం 7వ డివిజన్‌లో భాజపా విజయం
- ఖమ్మం 19, 43 డివిజన్లలో సీపీఐ విజయం
- ఖమ్మం 31వ డివిజన్‌లో సీపీఎం అభ్యర్థి విజయం
- ఇప్పటికే ఖమ్మం 10వ డివిజన్ తెరాసకు ఏకగ్రీవం
10:17 May 03
- ఖమ్మం 1, 13, 25, 37 డివిజన్లలో తెరాస విజయం
- ఖమ్మం 49, 55 డివిజన్లలో కాంగ్రెస్ విజయం
- ఖమ్మం 7వ డివిజన్‌లో భాజపా విజయం
- ఇప్పటికే ఖమ్మం 10వ డివిజన్ తెరాసకు ఏకగ్రీవం
- పరకాల 9వ వార్డు ఉపఎన్నికలో భాజపా అభ్యర్థి విజయం
10:00 May 03
- నల్గొండ: నకిరేకల్ 2వ వార్డులో తెరాస అభ్యర్థి విజయం
- నకిరేకల్ 2వ వార్డులో తెరాస అభ్యర్థి రాచకొండ సునీల్ గెలుపు
09:51 May 03
- ఖమ్మం 13వ డివిజన్‌లో తెరాస అభ్యర్థి కొత్తపల్లి నీరజ విజయం
- రంగారెడ్డి: కొత్తూరు ఏడో వార్డులో తెరాస అభ్యర్థి విజయం
- తెరాస అభ్యర్థి కమ్మరి జయమ్మ 26 ఓట్ల మెజార్టీతో గెలుపు
- కొత్తూరు 4వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి విజయం
- కాంగ్రెస్ అభ్యర్థి సొమ్లా నాయక్ 56 ఓట్ల మెజార్టీతో గెలుపు
- కొత్తూరు 1వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి విజయం
- కాంగ్రెస్ అభ్యర్థి పి.మాధవి 183 ఓట్ల మెజార్టీతో గెలుపు
- అచ్చంపేట ఒకటో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి విజయం
- కాంగ్రెస్ అభ్యర్థి గౌరీశంకర్ 130 ఓట్ల మెజార్టీతో గెలుపు
- అచ్చంపేట 16వ వార్డులో తెరాస అభ్యర్థి విజయం
- తెరాస అభ్యర్థి నరసింహ గౌడ్ 405 ఓట్ల మెజార్టీతో గెలుపు
- అచ్చంపేట 4వ వార్డులో తెరాస అభ్యర్థి విజయం
- తెరాస అభ్యర్థి మిరాజ్ బేగం 116 ఓట్ల మెజార్టీతో గెలుపు
- అచ్చంపేట 7వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి విజయం
- కాంగ్రెస్ అభ్యర్థి నూరి బేగం 125 ఓట్ల మెజార్టీతో గెలుపు
09:34 May 03
- అచ్చంపేట ఒకటో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి విజయం
- కాంగ్రెస్ అభ్యర్థి గౌరీశంకర్ 130 ఓట్ల మెజార్టీతో గెలుపు
08:42 May 03
గ్రేటర్ వరంగల్
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. రాంపూర్ దిల్లీ పబ్లిక్ స్కూల్‌లో కౌంటింగ్ చేపడుతున్నారు. వరంగల్‌లో 66 డివిజన్లను 3 బ్లాకులుగా చేసి లెక్కిస్తున్నారు. ఏ బ్లాకులో 32, బీలో 21, సీలో 13 డివిజన్లు ఉన్నాయి. మొత్తం 132 టేబుళ్లలో కౌంటింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత తొలి ఫలితం వచ్చే అవకాశం ఉంది.
ఖమ్మం కార్పొరేషన్
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఎస్సార్ బీజీఎన్నార్ కళాశాలలో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 60 డివిజన్లకు గాను 59 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. 10వ డివిజన్ అధికార తెరాసకు ఏకగ్రీవం అయింది. 10 కౌంటింగ్ హాళ్లలో ఓట్లు లెక్కిస్తున్నారు. ఒక్కో లెక్కింపు హాల్‌లో 6 డివిజన్ల ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు.
సిద్దిపేట
సిద్దిపేట పురపాలిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇందూర్ ఇంజినీరింగ్ కళాశాలలో కౌంటింగ్ చేపడుతున్నారు. 22 కౌంటింగ్ టేబుళ్లలో ఓట్లు లెక్కిస్తున్నారు. రెండు రౌండ్లలోనే లెక్కింపు పూర్తికానుంది. మొదటి రౌండ్‌లో 1 నుంచి 21 వార్డులు, రెండో రౌండ్‌లో 22 నుంచి 43 వార్డుల ఓట్లు లెక్కిస్తున్నారు.
నకిరేకల్
నకిరేకల్ పురపాలిక ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. మొత్తం 20 వార్డులకు ఓట్లు లెక్కిస్తున్నారు. తొలి రౌండ్‌లో 12, రెండో రౌండ్‌లో 8 వార్డుల లెక్కింపు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
జడ్చర్ల, అచ్చంపేట
జడ్చర్ల, అచ్చంపేట పురపాలికల ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. జడ్చర్ల డిగ్రీ కళాశాల, అచ్చంపేట జేఎంజే ఉన్నత పాఠశాలలో లో కౌంటింగ్ జరుగుతోంది. జడ్చర్ల పురపాలికలో 27 వార్డులు, అచ్చంపేట పురపాలికలో 20 వార్డులకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట లోపు జడ్చర్ల, అచ్చంపేట ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
కొత్తూరు
రంగారెడ్డి జిల్లా కొత్తూరు పురపాలిక ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. 12 వార్డులకు లెక్కింపు జరుగుతోంది. కొత్తూరు కె.జి.బి.వి.లో కౌంటింగ్ జరుగుతోంది.
08:12 May 03
తెలంగాణ మినీ పురపోరు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఖమ్మం, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లు, సిద్దిపేట, కొత్తూరు, జడ్చర్ల, అచ్చంపేట, నకిరేకల్ పురపాలికల కౌంటింగ్ ప్రారంభమైంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్, నల్గొండ, బెల్లంపల్లి, పరకాల, బోధన్, మెట్‌పల్లి, జల్‌పల్లి, గజ్వేల్‌లో ఒక్కో వార్డుకు లెక్కింపు ప్రారంభమైంది. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. అభ్యర్థులు, ఏజెంట్లకు కొవిడ్ నెగెటివ్ రిపోర్టు తప్పనిసరిచేశారు.