ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: రేపటి నుంచి ఉదయం 6.30 - రాత్రి 9.30 వరకు మెట్రో రైల్‌ - హైదరాబాద్ మెట్రో వేళలు

తెలంగాణ రాష్టం హైదరాబాద్​లో మెట్రో రైళ్ల సేవల సమయాన్ని అధికారులు పొడగించారు. రేపటి నుంచి ఉదయం 6.30 నిమిషాలకు నగరంలోని మూడు కారిడార్లలో మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.

Metro Rail Travel Time Extension in Hyderabad
తెలంగాణ: రేపటి నుంచి ఉదయం 6.30 - రాత్రి 9.30 వరకు మెట్రో రైల్‌

By

Published : Dec 2, 2020, 8:30 PM IST

హైదరాబాద్ మెట్రో రైళ్ల సేవల సమయాన్ని అధికారులు పొడిగించారు. రేపటి నుంచి ఉదయం 6.30 నిమిషాలకు నగరంలోని మూడు కారిడార్లలో మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.

ఇటీవల వరకు ఉదయం 7 గంటలకు మెట్రో ప్రారంభమయ్యేది. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు ఇక నుంచి 30 నిమిషాల ముందుగా అందుబాటులోకి తెచ్చినట్లు ఎండీ తెలిపారు. రాత్రి సమయంలో ఎలాంటి మార్పులేదు. గతంలోలాగే చివరి ట్రైన్ రాత్రి 9.30 నిమిషాలుగా ఉంది. రేపటి నుంచి నగరంలోని భరత్​నగర్, గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్ మెట్రో స్టేషన్​లు తెరచుకోనున్నాయి. కరోనా నేపథ్యంలో లాక్​డౌన్ నుంచి ఈ మూడు స్టేషన్​లు మూసి ఉంచిన సంగతి తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details