ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మేఘా'కే దక్కిన పోల'వరం'...న్యాయస్థానం నిర్ణయం తర్వాతే ఒప్పందం

పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో పనులను హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థ దక్కించుకుంది. ఐబీఎం విలువ 4వేల 987 కోట్ల కంటే 628 కోట్లు తక్కువగా బిడ్‌ను దాఖలు చేసిన మేఘా సంస్థ బిడ్‌ను సొంతం చేసుకున్నట్టు పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ తెలిపారు.

'మేఘా'కే దక్కిన పోల'వరం'...న్యాయస్థానం నిర్ణయం తర్వాతే ఒప్పందం

By

Published : Sep 24, 2019, 5:05 AM IST

Updated : Sep 24, 2019, 7:19 AM IST

పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ తక్కువకు బిడ్ చేసి ఎల్ 1 కాంట్రాక్టు సంస్థగా నిలిచింది. నిర్దేశిత బెంచ్ మార్క్ విలువ 4వేల 987.55 కోట్ల కంటే 12.6 శాతం తక్కువగా మేఘా సంస్థ కోట్ చేసింది. ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు సర్కిల్ కార్యాలయంలో జరిగిన రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో భాగంగా మేఘా సంస్థ ఒక్కటే దాఖలు చేసిన బిడ్ ను జలవనరుల శాఖ అధికారులు తెరిచారు. ప్రాజెక్టు అధికారులు నిర్దేశించిన ఐబీఎం విలువ కంటే 12.6 శాతం తక్కువగా బిడ్ ధర ఉండటంతో మేఘాకు ఈ ప్రాజెక్టు పనులు అప్పగించవచ్చని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ...ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నోట్ పంపారు.

'మేఘా'కే దక్కిన పోల'వరం'...న్యాయస్థానం నిర్ణయం తర్వాతే ఒప్పందం

780 కోట్ల మేర ఆదా....

పోలవరం ప్రధాన డ్యామ్, హెడ్ వర్క్స్‌లో మిగిలిపోయున 17 వందల 71.44 కోట్ల విలువైన పనుల్ని 24 నెలల కాలావధిలో పూర్తి చేయాలని షరతు విధించింది. 3వేల 216.11 కోట్లఅంచనాతో చేపట్టే జలవిద్యుత్‌ కేంద్రం పనులను 58 నెలల్లో పూర్తిచేయాలని స్పష్టంచేసింది. సెప్టెంబరు 9న నిర్వహించిన ప్రీబిడ్ సమావేశానికి 8 కంపెనీలు హాజరైనా..తుదిగడువు ముగిసే సరికి మేఘా ఇంజనీరింగ్ మాత్రమే బిడ్ దాఖలు చేసింది. రెండింటికీ కలిపి ఇనీషియల్ బెంచ్ మార్క్ విలువ 4వేల 987.55 కోట్లుకాగా... 4వేల 359.11 కోట్లకే చేస్తామని మేఘా సంస్థ ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థకు పనులు అవార్డు చేసేందుకు అధికారులు ప్రభుత్వానికి సిఫారసు చేశారు. గతంలో ఈ పనులను 4.8 శాతం అదనపు ధరకు అప్పగించారని ప్రస్తుతం మేఘా సంస్థ 12.6 శాతం తక్కువకు కోట్‌ చేసినందున..గతంతో పోలిస్తే మేఘా సంస్థ బిడ్ కారణంగా రూ.780 కోట్ల మేర ఆదా అయినట్టు ప్రభుత్వం జారీ చేసిన నోట్‌లో వివరించింది.

న్యాయ స్థానం నిర్ణయం తర్వాతే....
హెడ్ వర్క్స్ లో 2 వందల 23 కోట్ల రూపాయలు... జల విద్యుత్ కేంద్రం పనుల్లో 557 కోట్ల రూపాయలు ఆదాయ అవుతాయని జలవనరుల శాఖ పేర్కొంది. మేఘా సంస్థ.. సాంకేతిక, ఆర్థిక ఆర్హతలను పరిశీలించి అక్టోబరు 1న తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఐతే ప్రస్తుతం పోలవరం పనుల అంశం హైకోర్టు పరిధిలో ఉన్నందున ఈ సమాచారాన్ని జెన్‌కో ద్వారా న్యాయస్థానానికి తెలియజేస్తామని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తాజా టెండర్ల ప్రక్రియ ఫలితాలపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలశక్తి శాఖకు లేఖలు రాయనున్నట్లు జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ చెప్పారు. న్యాయస్థానం నిర్ణయం తర్వాతే మేఘా సంస్థతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు.

ఇవీ చూడండి-లీకేజీ వ్యవహారంతో మాకు సంబంధం లేదు: ఏపీపీఎస్సీ

Last Updated : Sep 24, 2019, 7:19 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details