రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర ట్వీట్.. ఏమన్నారంటే? - చిరు ట్వీట్
13:27 September 20
రాజకీయాలు నా నుంచి దూరం కాలేదు: చిరంజీవి
MEGASTAR TWEET : రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర ట్వీట్ చేశారు. తాను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నానని, కానీ రాజకీయం మాత్రం తన నుంచి దూరం కాలేదని వాఖ్యానించారు. ఈ మేరకు 10 సెకన్ల ఆడియో ఫైల్‌ను తన ట్విట్టర్ ఖాతాలో మెగాస్టార్ పోస్టు చేశారు.చిరంజీవి పెట్టిన ఈ ట్వీట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. అయితే ఈ మాటలు తన తాజా చిత్రం గాడ్ ఫాదర్‌లోని డైలాగులని పలువురు భావిస్తుండగా.. మరోవైపు చిరు మాటలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
సినిమా టికెట్ల ధరల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసిన సందర్భంలోనూ చిరంజీవి రాజకీయాలపై స్పష్టత ఇచ్చారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని పేర్కొన్నారు. మళ్లీ తాజాగా ట్విట్టర్ వేదికగా రాజకీయాలపై పోస్టు చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే ఇదంతా గాడ్ ఫాదర్ చిత్ర ప్రమోషన్ లో భాగంగానే చిరు ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 5న దసరా కానుకగా గాడ్ ఫాదర్ ప్రేక్షకుల ముందుకురానుంది.
ఇవీ చదవండి: