రెండ్రోజులుగా విడుదల కాని బులిటెన్...ఇక కొవిడ్ సమాచారం లేనట్లేనా..? - ఏపీ కొవిడ్ లేటెస్ట్ అప్డేట్స్
No covid Bulletin: రాష్ట్రంలో కొవిడ్ కేసుల నమోదుపై వైద్య ఆరోగ్యశాఖ నుంచి గత రెండు రోజుల నుంచి బులిటెన్లు రావడం లేదు. బులిటెన్ల జారీ ప్రారంభమైన అనంతరం రెండు రోజుల వరకు విడుదల కాకపోవడం ఇదే తొలిసారి కావడంతో ఇకపై కొవిడ్ సమాచారం లేనట్లేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
No covid Bulletin: రాష్ట్రంలో కొవిడ్ కేసుల నమోదుపై వైద్య ఆరోగ్యశాఖ నుంచి గత రెండు రోజుల నుంచి బులిటెన్లు రావడం లేదు. 2020 మార్చి నుంచి కొవిడ్ కేసుల నమోదుపై వైద్య ఆరోగ్యశాఖ నుంచి క్రమం తప్పకుండా ప్రతిరోజూ బులిటెన్లు విడుదలవుతున్నాయి. జిల్లాల వారీగా 24 గంటల్లో నమోదయ్యే కేసుల వివరాలు ఇందులో ఉండేవి. ప్రస్తుతం కేసులు కనిష్ఠ స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ తరుణంలో శుక్రవారం, శనివారాల్లో బులిటెన్లు విడుదల కాలేదు. బులిటెన్ల జారీ ప్రారంభమైన అనంతరం రెండు రోజుల వరకు విడుదల కాకపోవడం ఇదే తొలిసారి.
ఇదీ చదవండి:DISTRICT HEADQUARTERS : అన్ని ప్రాంతాలకు అందుబాటులో జిల్లా కేంద్రం