తెలంగాణలో వరంగల్ మహా నగరపాలక సంస్థ, ఖమ్మం నగరపాలికతోపాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు పురపాలక సంఘాలకు మేయర్, ఛైర్పర్సన్ల ఎన్నిక నేడు జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం, అనంతరం 3.30 గంటలకు మేయర్, చైర్పర్సన్ల పరోక్ష ఎన్నిక నిర్వహిస్తారు. ఇప్పటికే అభ్యర్థుల పేర్లతో కూడిన సీల్డ్ కవర్లను తెరాస అధిష్ఠానం... పార్టీ పరిశీలకులకు అందించింది. వరంగల్ మేయర్ పీఠాన్ని అధిష్టించేది ఎవరనేది ఇవాళ తేలిపోతుంది. 29వ డివిజన్ నుంచి పోటీకి దిగిన గుండు సుధారాణికి మేయర్ పీఠం ఖాయమన్న ప్రచారం ముందు నుంచి జరుగుతోంది.
నీరజ పేరు దాదాపుగా ఖరారు
ఖమ్మం ప్రథమ పౌరురాలిగా నీరజ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. సిద్దిపేట మున్సిపాల్టీకి కడవెర్లు మంజుల, జడ్చర్లలో దోరెపల్లి లక్ష్మి, నకిరేకల్‌లో రాచకొండ శ్రీనుకు, అచ్చంపేటలో నర్సింహగౌడ్ లేదా శైలజకు ఛైర్ పర్సన్లు కుర్చీ దక్కే అవకాశం ఉందని తెరాస శ్రేణులు భావిస్తున్నాయి. డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్పర్సన్ స్థానాల కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నేతలతో చర్చించి అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. పార్టీ పట్ల విధేయత, అనుభవం, సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
పరిశీలకులకు బాధ్యతలు