తెలంగాణలోని ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల ఎంపికకు ముందే అమాయకుల నుంచి అక్రమంగా డబ్బులు వసూళ్లు చేస్తున్న దందా బయటపడింది. స్టాఫ్ నర్సు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న గిరిజన యువతికి... ఉద్యోగమిప్పిస్తానని చెప్పి 2.5 లక్షల నగదును తీసుకునేందుకు యత్నించిన యువకుడిని మావల పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు నార్నూర్ మండలం మహాగావ్‌కి చెందిన బామనే రాజుగా పోలీసులు గుర్తించారు.
RIMS HOSPITAL: డబ్బులిస్తే ఉద్యోగం నీదేనన్నాడు.. చివరకు అరెస్టయ్యాడు.. - ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి తాజా వార్తలు
తెలంగాణలోని ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సు ఉద్యోగం ఇప్పిస్తానంటూ గిరిజన యువతికి వలస విసిరాడో యువకుడు. రెండున్నర లక్షల నగదును ఇస్తే... ఉద్యోగం నీదే అంటూ నమ్మించాడు. యువతి డబ్బులు చెల్లించే సమయానికి పోలీసులు రంగంలోకి దిగడంతో అతని బండారం బయటపడింది.
నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై హరిబాబును, సిబ్బందిని డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ పురుషోత్తమచారి అభినందించారు. ఉద్యోగ నియామకాలన్నీ పూర్తి పారదర్శకంగా జరుగుతాయని, మెరిట్ ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని డీఎస్పీ పేర్కొన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అనవసరంగా డబ్బులు ఇచ్చి మోసపోవద్దని నిరుద్యోగులకు ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:Death: కుటుంబ సభ్యులకు ఘాతుకానికి బలైన యువతి