ఏపీ ప్రభుత్వం తెచ్చిన దిశ చట్టం బాగుందని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కొనియాడారు. మహిళలపై వేధింపులు, నేరాల నివారణకు దిశ చట్టం దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. దిశ చట్టంపై ఏపీ ప్రభుత్వం నుంచి వివరాలు తీసుకున్నామని అనిల్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. మహారాష్ట్రలోనూ ఇదే తరహా చట్టాన్ని అమలు చేస్తామని అనిల్ దేశ్‌ముఖ్ పేర్కొన్నారు. సచివాలయంలో హోంమంత్రి సుచరితను మహారాష్ట్ర హోంమంత్రి, అధికారులు కలిశారు. ఈ భేటీలో సీఎస్ నీలం సాహ్ని, ఇరురాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దిశ చట్టం అమలు విధానాన్ని మహారాష్ట్ర హోంమంత్రి, అధికారులు అడిగి తెలుసుకున్నారు. దిశ చట్టంపై సందేహాలు మహారాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు నివృత్తి చేసుకున్నారు. దిశ యాప్ పనిచేసే విధానాన్ని మహారాష్ట్ర బృందానికి సుచరిత వివరించారు.
దిశ చట్టం బాగుంది: మహారాష్ట్ర హోంమంత్రి
సీఎం జగన్‌ను మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను మహారాష్ట్ర బృందం కలిసింది. మహారాష్ట్ర డీజీపీ సుబోత్ కుమార్ జైస్వాల్, పోలీసు ఉన్నతాధికారులు దిశ చట్టం, అమలు తీరు గురించి తెలుసుకునేందుకు వచ్చారు. హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్, దిశ స్పెషల్ ఆఫీసర్లు ఆ చట్టం గురించి వివరించారు.
దిశ చట్టం బాగుంది: మహారాష్ట్ర హోంమంత్రి