Machilipatnam Port: బందర్ పోర్టు నిర్మాణానికి అవసరమైన భూములు అప్పగించకుంటే...నిర్మాణం ఎలా పూర్తిచేస్తామని నవయుగ సంస్థ హైకోర్టుకు తెలిపింది. ఒప్పందం మేరకు ప్రభుత్వం తమకు భూములు అప్పగించడంలో విఫలమైందని వివరించింది. 2021లో జారీ చేసిన జీవో పరిశీలిస్తే...మొదటి దశ భూములు సేకరించాల్సి ఉందని తెలుస్తోందన్నారు. భూములు అప్పగించకుండా పోర్టు నిర్మాణం ఎలా సాధ్యమని...మొత్తం భూమిని ఒకేసారి అప్పగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపింది.
మచిలీపట్నం పోర్టు విషయంలో... తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు - అమరావతి తాజా వార్తలు
Machilipatnam Port: మచిలీపట్నం పోర్టు ఒప్పందాన్ని రద్దు చేస్తూ ఏపీ ఇంధన, మౌలిక, పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శి 2019 ఆగస్టు 8 న జారీచేసిన జీవో 66 ను సవాలు చేస్తూ నవయుగ మచిలీపట్నం పోర్ట్ లిమిటెడ్' సంస్థ డైరెక్టర్ వై.రమేశ్ 2019 సెప్టెంబరులో హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై తుది విచారణ జరిపిన న్యాయమూర్తి వ్యాజ్యాన్ని కొట్టేస్తూ ఈ ఏడాది ఆగస్టు 25న తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును సవాలు చేస్తూ ఎన్ఎంపీఎల్... ధర్మాసనం ముందు అప్పీల్ వేసింది. అప్పీల్‌పై విచారణ జరిపిన ధర్మాసనం... మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అంశంపై తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఏం చెప్పిందంటే..?
పోర్టు నిర్మాణ పనులను ప్రభుత్వం మూడోపక్షానికి అప్పగించే యోచనలో ఉందని... అందుకే యథాతథస్థితి ఉత్తర్వులివ్వాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించి ఏజీ...మొత్తం భూమిని ఒకేసారి అప్పగించాల్సిన అవసరం లేదని, నవయుగ సంస్థ ఒప్పంద షరతులకు కట్టుబడలేదని తెలిపారు, నిబంధనలు ఉల్లంఘిస్తే ఒప్పందం రద్దు చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని సింగిల్ జడ్జి ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది.
ఇవీ చదవండి: