తెలంగాణ భవన్‌లో తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో తెతెదేపా మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ తెరాస పార్టీలో చేరారు. ఎల్.రమణతో పాటు పలువురు నేతలకు తెలంగాణ భవన్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గులాబీ కండువా వేసి తెరాసలోకి ఆహ్వానించారు. తెరాసలోకి ఎల్.రమణకు హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నామని కేసీఆర్ అన్నారు. రాష్ట్రాభివృద్ధికి తనవంతు సహకారం అందించడానికే ఎల్.రమణ పార్టీలో చేరారన్నారు. నిబద్ధత గల వ్యక్తి పార్టీలో చేరడం సంతోషకరమన్నారు. చేనేత సామాజిక వర్గం సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చేనేత కార్మికులు ఎవరు చనిపోయినా రైతు బీమాలాగా బీమా వర్తించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సిరిసిల్ల పర్యటనలో ఇది ఇప్పటికే చెప్పామని గుర్తుచేశారు.
అద్భుత పథకాలు అమలు చేశాం..
తెరాస పథకాలు ప్రతి గ్రామంలో ప్రజల ప్రత్యక్ష అనుభవంలో ఉన్నాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని ప్రజలు అవకాశం ఇచ్చారని.. చిన్న తప్పు దొర్లితే కొన్ని తరాలకు దెబ్బకొడుతుందన్నారు. అజెండా ప్రకారం మార్గదర్శకాలు రూపొందించి ముందుకెళ్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. నీటిపారుదలలో నేరపూరిత నిర్లక్ష్యంతో రాష్ట్రానికి నష్టం జరిగిందని.. తెలంగాణ పునర్నిర్మాణం అక్కడి నుంచే ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. మిషన్ కాకతీయ వంటి అద్భుత పథకాలు అమలు చేశామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
చేనేత వర్గం సమున్నతంగా బతికేందుకే..
వరంగల్ జిల్లాకు చెందిన చేనేత కార్మికులు సూరత్‌లో ఉన్నారని... వారి సమస్యలపై అక్కడకు అధికారులను పంపామని సీఎం చెప్పారు. రాష్ట్రంలో జౌళి పరిశ్రమను ప్రోత్సహిస్తే తిరిగివస్తామని వారు చెప్పారని తెలిపారు. వరంగల్‌లో వెయ్యి ఎకరాల్లో మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేశామని... ఇటీవలే జౌళి పార్కులో పరిశ్రమల ఏర్పాటుకు సంస్థలు వస్తున్నాయని వెల్లడించారు. వరంగల్‌లో భారీ టెక్స్‌టైల్ పార్క్, సిరిసిల్లలో అపారెల్ పార్క్‌లతో చేనేత జీవన ముఖచిత్రం మారుతుందనే విశ్వాసం ప్రకటించారు. ఉద్యమం సమయంలో తెలంగాణ ఏర్పాటైతే ధనిక రాష్ట్రంగా మారుతామని చెప్పామని... ఇప్పుడు తెలంగాణ ఉద్యోగులు దేశంలోనే మంచి జీతాలు అందుకుంటున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. నిన్న 40 ఎకరాలు అమ్మితే రూ.2 వేల కోట్లు వచ్చాయని... ఆ ప్రజాధనాన్ని ప్రజల సంక్షేమం కోసమే వినియోగిస్తామని వెల్లడించారు. చేనేత వర్గం సమున్నతంగా బతికేందుకు కృషి చేస్తున్నామన్నారు.
అగ్రస్థానంలో తెలంగాణ