వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అల్పపీడనం ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. తీరం వెంబడి గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని తెలియజేసింది. సముద్రంలోనూ అలల తీవ్రత పెరిగే అవకాశమున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచనలు జారీ చేశారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణశాఖ కమిషనర్ కన్నబాబు హెచ్చరించారు.
ఇదీ చదవండి: