ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అమరావతిని ముంచింది వరద కాదు... వైకాపా' - లోకేశ్ లెటేస్ట్ ట్వీట్స్

అమరావతి భారీ వరద కారణంగా మునగలేదు కానీ... వైకాపా దొంగదెబ్బకు మునిగిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. అమరావతిలో ఇన్​సైడర్ ట్రేడింగ్​కు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా అని వైకాపాకు సవాల్ విసిరారు. విజయనగరం, విశాఖ జిల్లాలో వైకాపా 40 వేల ఎకరాల ఇన్​సైడర్ ట్రేడింగ్​కు పాల్పడిందని ఆరోపించారు. జగన్ అండ్ కో దౌర్జన్యాలు చూసి కంపెనీలు పక్క రాష్ట్రాలకు పోతున్నాయని లోకేశ్ ట్వీట్ చేశారు.

lokesh
లోకేశ్

By

Published : Dec 24, 2019, 11:51 PM IST

అమరావతిని అద్భుత నగరంగా తీర్చిదిద్దుతామని నమ్మబలికిన సీఎం జగన్‌ మాటమార్చి, మడమ తిప్పి అమరావతిని ముంచేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. శాసనసభలో జగన్ అమరావతికి జై కొట్టారని.. రాజధాని అమరావతిలోనే ఉంటుందని ఎన్నికల మానిఫెస్టోలో పేర్కొన్న విషయాన్ని లోకేశ్ గుర్తు చేశారు. అమరావతి భారీ వరద కారణంగా మునగలేదు కానీ.. వైకాపా దొంగదెబ్బకు మునిగిందని ఆరోపించారు. రాజధాని మార్చడానికి వీలులేదంటూ రాజధాని రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

అమరావతిలో ఇన్​సైడర్ ట్రేడింగ్ అని పాత పాటే పాడుతున్న వైకాపా... ఆధారాలు చూపించమంటే ఎందుకు వెనకడుగు వేస్తుందని మండిపడ్డారు. ఇన్​సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై హైకోర్టు జడ్జితో విచారణకు సిద్ధమని ప్రకటించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన 7 నెలల కాలంలో విశాఖ, విజయనగరం జిల్లాల్లో జరిగిన 40 వేల ఎకరాల ఇన్​సైడర్ ట్రేడింగ్​పై హైకోర్టు జడ్జితో విచారణకు వైకాపా సిద్ధమా అని సవాల్‌ విసిరారు. పాలనతో ప్రజల్ని సంతృప్తిపరచలేని జగన్ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ప్రజల దృష్టి మరల్చాలని చూస్తున్నారని లోకేశ్ విమర్శించారు.

విశాఖలో అదానీ డేటా సెంటర్ వలన రూ.70 వేల కోట్ల పెట్టుబడి, 28 వేల మందికి ప్రత్యక్షంగానూ, 85 వేల మందికి పరోక్షంగానూ ఉపాధి లభించేదని చెప్పారు. అసమర్థ పాలన, చెత్త నిర్ణయాలతో ఆ కంపెనీ రాష్ట్రానికి రాకుండా చేశారని మండిపడ్డారు. తిరుపతిలో ఒక్క రిలయన్స్ జియో ఫోన్ల తయారీ కంపెనీ రావడం ద్వారా 15 వేల కోట్ల పెట్టుబడి, 25 వేల మందికి ఉద్యోగాలు వచ్చేవని లోకేశ్ తెలిపారు. జగన్ అండ్ కో దౌర్జన్యాలు చూసి కంపెనీలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోవటం వలన.. రాజధానుల పేరిట కొత్త డ్రామా మొదలుపెట్టారని వరుస ట్వీట్లు చేశారు లోకేశ్.

లోకేశ్ ట్వీట్

ఇదీ చదవండి :

'దిల్లీలో అపాయింట్​మెంట్ లేదు... గల్లీలో ఉల్లి లేదు'

ABOUT THE AUTHOR

...view details