కృష్ణా వరద బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచినీటిని సరఫరా చేశామని తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. విజయవాడలో ట్యాంకర్ల ద్వారా 20 వేల లీటర్ల తాగునీటిని వరద బాధితులకు అందించారని తెలిపారు. సామాజిక బాధ్యతతో ప్రజలకు సేవ చేయడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని వివరించారు. ఈ ఏడాది అనేక రాష్ట్రాలు వరద నష్టాలను ఎదుర్కొన్నాయన్న లోకేశ్... ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అప్రమత్తంగా వ్యవహరించి బాధితులకు అండగా నిలిచారన్నారు. ఇప్పటికే బాధితులకు సాయం ప్రకటించారని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మాత్రం 'అక్కరకు రాని చుట్టం'లా అమెరికాలో బిజీగా ఉన్నారని లోకేశ్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
సీఎం గారు... మీరెక్కడ?: లోకేశ్ - lokesh tweet on jagan
ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వరద బాధితులకు 20 వేల లీటర్ల తాగునీటిని సరఫరా చేశామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ట్విట్టర్లో పేర్కొనారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజల బాధలకు అండగా నిలిస్తే.. ఏపీ సీఎం సొంత పనుల్లో బిజీగా ఉన్నారని విమర్శించారు.
సీఎం గారు...మీరెక్కడా : లోకేశ్