మద్యపాన నిషేధం కోసం జగన్ 'మంద'డుగు వేస్తూనే ఉన్నారని... తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ఫలితంగా రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని ట్విట్టర్ వేదికగా విమర్శించారు. గ్రామాల్లో బెల్టుషాపులు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని ధ్వజమెత్తారు. జగనన్న... మద్యం దుకాణాల్లో రేటు పెంచి వైకాపా మార్క్ దోపిడీని యధావిధిగా కొనసాగిస్తున్నారని ఆరోపించారు. గతం కంటే అమ్మకాలు తగ్గాయేమో చెప్పాలని ట్విట్టర్లో ప్రశ్నించారు.
మద్యపాన నిషేధానికి సీఎం జగన్ 'మంద'డుగు వేస్తున్నారు: లోకేశ్ - మద్యపానంపై లోకేశ్
రాష్ట్రంలో మద్యం అమ్మకాలు గతం కంటే తగ్గాయో లేదో చెప్పాలని... తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ప్రశ్నించారు. మద్యపాన నిషేధం కోసం జగన్ 'మంద'డుగు వేస్తున్నారని ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో మద్యపానంపై లోకేశ్