ముఖ్యమంత్రి జగన్రెడ్డి ముఖం చూసి, రాష్ట్రంలో ఎవ్వరూ పెట్టుబడులు పెట్టట్లేదనటానికి కేంద్ర నివేదికలే నిదర్శనమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. చంద్రబాబు మెట్టు మెట్టు పేర్చుకుంటూ, మహారాష్ట్ర, తమిళనాడు లాంటి రాష్ట్రాలతో పోటీ పడి మరీ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించి.. రాష్ట్రాన్ని మొదటి 5 స్థానాల్లో నిలుపుతూ వచ్చారని గుర్తు చేశారు. జగన్ రెడ్డి దరిద్ర పాదానికి, అరాచకం తోడయ్యి, ఇప్పుడు విదేశీ పెట్టుబడులను ఆకర్షించటంలో, 13వ స్థానానికి పడిపోయామని మండిపడ్డారు. మన పక్కన రాష్ట్రాలన్నీ, ఉన్నత స్థానంలోకి చేరుతుంటే, మన రాష్ట్రం దిగజారిపోతోందని దుయ్యబట్టారు.
'జగన్ను చూసి పెట్టుబడులు పెట్టడానికి రావట్లేదు'
సీఎం జగన్ను చూసి రాష్ట్రంలో ఎవ్వరూ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. చంద్రబాబు మెట్టు మెట్టు పేర్చుకుంటూ అభివృద్ధి దిశగా సాగితే.. జగన్ రాష్ట్రాన్ని పాతాళంలోకి నెట్టేశారని మండిపడ్డారు.
Lokesh on Foreign Investments