ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

యథా సీఎం.. తథా మంత్రి: లోకేశ్

'యథా సీఎం.. తథా మంత్రులు' అన్నట్లు సీఎం జగన్, మంత్రులు ప్రవర్తిస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. అబద్ధపు ఆరోపణలు చేస్తూ.. తెదేపాపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

యథా సీఎం.. తథా మంత్రి: లోకేశ్

By

Published : Aug 7, 2019, 10:26 AM IST

యథా సీఎం.. తథా మంత్రి: లోకేశ్

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రులపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తెదేపాపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వారు చేస్తున్న అబద్ధపు ప్రచారాలపై కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. రిలయన్స్ కంపెనీ పేరుతో తప్పుడు సంస్థను సృష్టించి... తెదేపా 1000 ఎకరాలు కొట్టేసేందుకు కుట్ర చేసిందని మంత్రి గౌతంరెడ్డి ఆరోపించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆయనపై ధ్వజమెత్తారు. బాధ్యతారహితంగా ఆరోపణలు చేస్తున్నారనీ.. రెండు నిమిషాలు ఆలోచిస్తే సమాచారమంతా ఇంటర్నెట్​లో దొరుకుతుందని హితబోధ చేశారు. రిలయన్స్ కంపెనీకి సంబంధించిన ఫైనాన్సియల్ స్టేట్​మెంట్లను లోకేశ్ ట్విట్టర్​లో పోస్ట్ చేశారు.

ఆలోచన లేని సీఎం

సీఎం జగన్ అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని లోకేశ్ విమర్శించారు. కొత్త విధానం ఆలోచించకుండా పాత ఇసుక విధానాన్ని రద్దు చేశారన్నారు. ఈ నిర్ణయంతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలయ్యిందనన్నారు. 20లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. ఇసుక రీచ్​లను దోచుకొమ్మని వైకాపా నేతలను అప్పగించారని తీవ్ర విమర్శలు చేశారు.

ఇవీ చదవండి..

సుష్మా జీ.. మీ సేవలు మరువం: గవర్నర్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details