ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 30, 2022, 5:30 AM IST

ETV Bharat / city

15 ఏళ్ల లీజుకు ఆర్టీసీ స్థలాలు.. అధికారుల కొత్త ప్రతిపాదనలు

ఆర్టీసీ బస్టాండ్ల పరిధిలో ఖాళీగా ఉన్న స్థలాలను 15 ఏళ్లకు లీజుకు ఇచ్చేందుకు యాజమాన్యం సిద్ధమైంది. 33 ఏళ్లపాటు లీజులకు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో లీజు గడువును 15 ఏళ్లకు తగ్గించి నిబంధనల్లో మార్పులు చేసింది.

15 ఏళ్ల లీజుకు ఆర్టీసీ స్థలాలు
15 ఏళ్ల లీజుకు ఆర్టీసీ స్థలాలు

ఆర్టీసీ బస్టాండ్ల పరిధిలో ఖాళీగా ఉన్న స్థలాలను 33 ఏళ్లపాటు లీజులకు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో లీజు గడువును 15 ఏళ్లకు తగ్గించి నిబంధనల్లో మార్పులు చేసేందుకు యాజమాన్యం సిద్ధమైంది. నిర్మించు, నిర్వహించు, బదలాయించు (బీవోటీ) కింద రాష్ట్రంలో 29 బస్టాండ్ల స్థలాలను 33 ఏళ్లపాటు లీజుకు ఇచ్చేందుకు అధికారులు కొద్ది రోజుల కిందట టెండర్లు పిలిచారు. ఇందులో కేవలం నరసరావుపేట మినహా... రాష్ట్రంలోని మరే ఇతర స్థలాలను తీసుకునేందుకు వ్యాపారులు, సంస్థలు ముందుకు రాలేదు.

ఈ విధానంలో అనేక షరతులు ఉండటం, సెక్యూరిటీ డిపాజిట్‌గా ఎక్కువ మొత్తం చెల్లించాలనే నిబంధన తదితరాల కారణంగా ఎవరూ ముందుకు రాలేదని అధికారులు గుర్తించారు. దీంతో 15 ఏళ్లకు స్థలాలు లీజుకు ఇవ్వడానికి ప్రతిపాదిస్తున్నారు. బీవోటీ విధానంలో లీజు తీసుకుంటే.. శాశ్వత నిర్మాణం చేసుకునేందుకు వీలుంటుంది. కొత్తగా 15 ఏళ్లకు లీజు విధానంలో ఖాళీ స్థలమైనా వినియోగించుకునేలా, లేకపోతే శాశ్వత నిర్మాణానికి బదులు తాత్కాలిక నిర్మాణం (సెమీ కన్‌స్ట్రక్షన్‌) చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. మొత్తంగా 99 స్థలాలు ఉన్నట్లు గుర్తించారు. వీటిని లీజుకు ఇస్తే ఏడాదికి రూ.25 కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందులో 53 స్థలాలను లీజుకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details