Rape on Minor Girl: మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌కోర్టు తీర్పు వెలువరించింది. 2015లో బాలాపూర్‌కు చెందిన బాలికపై ఇంట్లో ఎవరూ లేని సమయంలో అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఒడిశాకు చెందిన రషీద్, చార్మినార్‌కు చెందిన అక్బర్ ఖాన్‌లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈఘటనపై బాలాపూర్ పోలీసులకు బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
బాలికపై అత్యాచారం.. నిందితుడికి 20ఏళ్ల జైలుశిక్ష - బాలికపై అత్యాచారం నిందితుడికి 20ఏళ్ల జైలుశిక్ష
Rape on Minor Girl: మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఎల్బీనగర్‌కోర్టు తీర్పు వెలువరించింది. 2015లో ఇద్దరు నిందితులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై విచారణ జరిపిన కోర్టు నిందితుడికి 20 ఏళ్లు కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2వేల జరిమానా విధించింది.
నిందితుడికి 20ఏళ్ల జైలుశిక్ష
కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. అయితే, కేసు విచారణలో ఉండగానే అక్బర్‌ఖాన్ అనారోగ్యంతో మృతి చెందాడు. ఘటనకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించిన పోలీసులు కోర్టుకు సమర్పించారు. విచారణ జరిపిన కోర్టు నిందితుడు రషీద్‌కు 20 ఏళ్లు కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2వేల జరిమానా విధించింది. దీంతో పాటు బాలికకు బాధితుల పరిహారం కింద రూ.5 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇవీ చదవండి: