Corona cases: రాష్ట్రంలో కొత్తగా 4,458 కరోనా కేసులు, 38 మరణాలు - ఏపీలో కరోనా కేసుల తాజా సమాచారం
17:10 June 25
తూర్పుగోదావరిలో అత్యధికంగా 909 మంది బాధితులు
రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 4,458 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 6,313 మంది కరోనా నుంచి కొలుకున్నారు. అత్యధికంగా తూర్పుగోదావరిలో 909 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వగా.. అత్యల్పంగా విజయనగరంగా 98మందికి సోకింది. ఈ మహమ్మారి కారణంగా మరో 38 మంది మరణించారు. అత్యధికంగా చిత్తూరులో 9మంది మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,51,41,485 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండీ..VIDEO VIRAL: కారుతో ఢీకొట్టాడు..అడిగితే దురుసుగా ప్రవర్తించాడు