ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 31, 2020, 12:35 PM IST

ETV Bharat / city

భూ వివాదం: కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్న ఇరువర్గాలు

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో భూవివాదం చోటుచేసుకుంది. ఓ భూమి కోసం... నాదంటే నాది అని... మహిళలు, పురుషులు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు.

land-dispute-in-yadadri-bhubaneswar-district
యాదాద్రి భువనగిరి జిల్లాలో భూవివాదం

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరులో భూవివాదం చోటుచేసుకుంది. సర్వే నంబర్​ 269 విస్తీర్ణం 1-19 గుంటల భూమి నాదంటే.. నాది అని ఇరుకుటుంబాల వారు అదే భూమిలో కొట్టుకున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో భూవివాదం

పురుషులు, మహిళలు.. కర్రలతో దాడి చేసుకున్నారు. ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. దీనితో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ విషయంపై రెవెన్యూ సిబ్బందిని వివరణ కోరగా... జిల్లా స్థాయి అధికారుల పరిధిలో ఉందని తెలిపారు. ఈ మేరకు నివేదికను గతంలోనే తహసీల్దార్​ కార్యాలయం నుంచి అందించామని పేర్కొన్నారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:స్వచ్ఛమైన గాలి.. మట్టివాసన... ఫామ్‌టూర్స్‌కు నగరవాసులు

ABOUT THE AUTHOR

...view details