కేఆర్‌ఎంబీ(KRMB sub committee sagar visit) ఉపసంఘం సభ్యులు.. తెలంగాణలోని నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. పెద్దఅడిశర్లపల్లి మండలం పుట్టంగండి రిజర్వాయర్‌ను సభ్యులు పరిశీలించారు. నాగార్జునసాగర్ చేరుకున్న కేఆర్‌ఎంబీ సబ్ కమిటీ సభ్యులు... సాగర్ జలాశయం, విద్యుదుత్పత్తి కేంద్రం పరిశీలించనున్నారు. సాగర్ కుడి కాలువ వివరాలపై ఆరా తీయనున్నారు. కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ప్రాజెక్టులను తమ పరిధిలోకి తీసుకునేందుకు కృష్ణా బోర్డు (Krishna River Management Board) ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గత నెలలో జరిగిన బోర్డు (Krishna River Management Board news) సమావేశంలో అప్పగించేందుకు గుర్తించిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో కంపోనెంట్లను క్షేత్రస్థాయిలో సందర్శించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇవాళ, రేపు ఉపసంఘం (KRMB Subcommittee news) నాగార్జునసాగర్‌లో పర్యటించనుంది.
క్షేత్రస్థాయిలో పరిశీలన
రెండు రోజుల పాటు క్షేత్రస్థాయిలోని కంపోనెంట్లను పరిశీలించి రెండోరోజు మధ్యాహ్నం రెండు రాష్ట్రాల సభ్యులతో ఉపసంఘం (KRMB Subcommittee inspected sagar project) సాగర్‌లో సమావేశం నిర్వహించనుంది. ఈ మేరకు బోర్డు (Krishna River Management Board) ఓ ప్రకటనను ఇదివరకే విడుదల చేసింది. గతంలో శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన ఔట్ లెట్లను పరిశీలించిన ఉప సంఘం... సోమవారం ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పంప్ హౌస్, సాగర్ స్పిల్ వే, స్లూయిస్, ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, కుడి కాల్వ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, కుడి కాల్వ హెడ్ రెగ్యులేటర్లను పరిశీలించనుంది. మంగళవారం సాగర్ ఎడమ కాల్వ పవర్ హౌస్, ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేటర్, వరద కాల్వ హెడ్ రెగ్యులేటర్‌లను పరిశీలిస్తారు. అదే రోజు మధ్యాహ్నం సాగర్‌లో ఉపసంఘం (KRMB Subcommittee) సమావేశం జరగనుంది.
పోలవరంపై కేంద్రం సమీక్ష ఎప్పుడు?