KRMB Meeting Today: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు జలాశయాల పర్యవేక్షక కమిటీ ఇవాళ మరోమారు సమావేశం కానుంది. అయితే రెండు రాష్ట్రాల అధికారుల హాజరు మాత్రం అనుమానాస్పదంగానే ఉంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో జలవిద్యుత్ ఉత్పత్తి కోసం మార్గదర్శకాలు, వరదజలాల లెక్కలు, రూల్ కర్వ్స్కు సంబంధించిన నివేదికను ఖరారు చేసి సంతకాలు చేసేందుకు గతంలోనే ఆర్ఎంసీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
అయితే వివిధ కారణాల రీత్యా సమావేశం వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఆర్ఎంసీ ఐదో సమావేశాన్ని ఇవాళ ఏర్పాటు చేశారు. కేఆర్ఎంబీ సభ్యుడు రవి కుమార్ పిళ్ళై కన్వీనర్‌గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులు సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. అయితే ముందుగానే ఖరారైన కార్యక్రమాలు ఉన్నందున తమకు వీలు కాదని.. మరోరోజు సమావేశం నిర్వహించాలని ఏపీ అధికారులు ఇప్పటికే బోర్డుకు లేఖ రాశారు.