ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కోయంబేడు చిచ్చు..7 జిల్లాల్లో 31 కరోనా కేసులు - latest updates of covid19

కోయంబేడు మార్కెట్​ ప్రభావం రాష్ట్రంలోని పలు జిల్లాలకు క్రమంగా విస్తరిస్తోంది. ప్రారంభంలో చిత్తూరు, నెల్లూరు వంటి సరిహద్దు జిల్లాలకే ఇది పరిమితమైనా తర్వాత అన్ని జిల్లాలకూ పాకుతోంది.రాష్ట్రంలో 48 మందికి కొత్తగా వ్యాధి సోకినట్లు ప్రభుత్వం ప్రకటిస్తే... వారిలో 31 మంది కోయంబేడు వెళ్లి వచ్చినవారే.

koyambedu
koyambedu

By

Published : May 17, 2020, 8:37 AM IST

రాష్ట్రంలో ప్రస్తుతం కోయంబేడు మార్కెట్‌ కారణంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రారంభంలో చిత్తూరు, నెల్లూరు వంటి సరిహద్దు జిల్లాలకే ఇది పరిమితమైనా తర్వాత అన్ని జిల్లాలకూ విస్తరించింది. శనివారం రాష్ట్రంలో 48 మందికి కొత్తగా వ్యాధి సోకినట్లు ప్రభుత్వం ప్రకటించింది. వారిలో 31 మంది కోయంబేడు వెళ్లి వచ్చినవారే. ఇందులో ఏడు జిల్లాల వారు ఉన్నారు.

విశాఖపట్నం జిల్లాలోనూ ఈ తరహా కేసు వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో 2,205 మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 150 మంది కలిపి మొత్తం 2,355 మంది బాధితులున్నారు. కర్నూలు జిల్లాలో కేసులు 600 దాటాయి. మూడు అంకెల సంఖ్య దాటిన జిల్లాలు రాష్ట్రంలో ఏడు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో మరొకరు మరణించడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో 49 మంది మరణించినట్లయింది. గడిచిన 24 గంటల్లో 101 మంది కోలుకోగా ఇంతవరకు మొత్తం 1,353 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 803 మంది చికిత్స పొందుతున్నారు.

ప్రకాశం జిల్లాలో యాక్టివ్‌ కేసులు సున్నా
ప్రకాశం జిల్లాలో మరో ముగ్గురు కరోనా నుంచి కోలుకోవడంతో ఇళ్లకు పంపినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఈ జిల్లాలో మొత్తం 63 మంది బాధితులూ కోలుకుని ఇళ్లకు చేరినట్లు ప్రభుత్వ ప్రకటన తెలియజేస్తోంది. దీంతో ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఒక్క యాక్టివ్‌ కేసూ లేనట్లయింది.

ఇదీ చదవండి :

ఆ పాదాలకు.. అలుపుండదా....

ABOUT THE AUTHOR

...view details