మాదకద్రవ్యాల దందా (DRUGS) నుంచి యువత భవిష్యత్ కాపాడేందుకు బాధ్యతగల ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీస్తే.. ఆ వ్యవహారాన్ని కప్పిపుచ్చేలా పోలీసు శాఖ తమకు నోటీసులు పంపిందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. ప్రపంచ స్థాయిలో డ్రగ్స్ (DRUGS) దందా నడుపుతున్న తాడేపల్లి ప్యాలెస్ పెద్దల్ని కాపాడేందుకు నోటీసులు పంపారా? అని నిలదీశారు. క్షమాపణ చెప్పకుంటే చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొనడాన్ని తప్పుబట్టారు పట్టాభి. ఎట్టి పరిస్థితిల్లోనూ క్షమాపణ చెప్పే పరిస్థితి ఉండదని తేల్చిచెప్పారు.
DRUGS CASE: ఎట్టిపరిస్థితిల్లోనూ అది జరగదు.. డీజీపీ ఏమంటారు? : పట్టాభిరామ్
మాదకద్రవ్యాల వ్యవహారాన్ని కప్పిపుచ్చేలా.. పోలీసు శాఖ తమకు నోటీసులు పంపిందని తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. నోటీసుల్లో పేర్కొన్న విషయాలపై స్పందించిన పట్టాభి.. వారు కోరిన విధంగా ఎట్టిపరిస్థితిల్లోనూ జరగనే జరగదని తేల్చి చెప్పారు.
pathabhi
రాష్ట్ర భవిష్యత్ కోసం పోరాటం కొనసాగించి తీరుతామని పట్టాభి స్పష్టం చేశారు. మాచవరం సుధాకర్ పేరు ప్రస్తావించటంతోపాటు విజయవాడలో సోదాలు నిర్వహించి, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ పత్రికా ప్రకటనలో చెప్పడంపై డీజీపీ ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. పోలీసుశాఖ వైఫల్యాలతోపాటు తాము సేకరించిన ఆధారాలను త్వరలోనే కేంద్ర సంస్థలకు అప్పగిస్తామని పట్టాభి అన్నారు.
ఇదీ చదవండి: