మాజీ మంత్రి కొల్లురవీంద్రను పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. వైకాపా నేత మోకా భాస్కరరావు హత్య కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. జూన్ 29న హత్య అనంతరం... మోకా బంధువులు ఇచ్చిన ఫిర్యాదులో ఇతర నిందితులతోపాటు తెలుగుదేశం నేత కొల్లు రవీంద్ర పేరు ఉంది. ఈ కేసులో ఇప్పటివరకూ ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా... నిన్న సాయంత్రం కొల్లును ప్రశ్నించేందుకు... డీఎస్పీ మహబూబ్‌బాషా నేతృత్వంలో దర్యాప్తు బృందం ఇంటికి, కార్యాలయానికి వెళ్లింది. అక్కడ కొల్లు లేకపోవటమేగాక... ఫోన్ కూడా స్విచ్ఛాప్ చేసి ఉండటంతో మూడు బృందాలతో పోలీసులు తనిఖీలు ప్రారంభించారు. విశాఖ వెళ్తున్న కొల్లు రవిని... తూర్పుగోదావరి జిల్లా తుని మండలం సీతారాంపురం వద్ద మఫ్టీలో ఉన్న పోలీసులు అరెస్టు చేశారు.
వైకాపా నేత హత్య కేసులో.. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టు - వైకాపా నేత మోకా భాస్కరరావు హత్య కేసు
మచిలీపట్నం మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్, వైకాపా నేత మోకా భాస్కరరావు హత్య కేసులో.. మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
kollu ravindra