ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కీలక నిర్ణయాలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం - ఏపీ మంత్రివర్గ నిర్ణయాలు

రాష్ట్ర కేబినెట్ భేటీ ముగిసింది. దాదాపు 2 గంటల పాటు సాగిన సమావేశంలో నూతన పారిశ్రామిక విధానంతో పాటు వైఎస్​ఆర్ ఆసరా, జగనన్న విద్యా కానుకకు ఆమోదం తెలిపింది. మంత్రి పేర్ని నాని కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు.

Andhra Pradesh Cabinet
Andhra Pradesh Cabinet

By

Published : Aug 19, 2020, 3:11 PM IST

Updated : Aug 19, 2020, 4:35 PM IST

వివరాలు వెల్లడిస్తున్న మంత్రి పేర్ని నాని

సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం రెండు గంటలపాటు కొనసాగింది. నూతన పారిశ్రామిక విధానంతో పాటు వైఎస్‌ఆర్‌ ఆసరా, జగనన్న విద్యాకానుకకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భావనపాడు పోర్టు నిర్మాణానికి సంబంధించిన డిపిఆర్​కు ఆమోదం తెలిపింది.

రాష్ట్రంలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. ఏపీలో ఏర్పాటు చేయాలంటూ కేంద్రానికి లేఖ రాయాలని మంత్రివర్గం నిర్ణయించింది. నియోజకవర్గాల్లోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని మంత్రులు కోరారు. కేబినెట్ సమావేశానికి వ్యక్తిగత కారణాలతో పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆరోగ్య కారణాల రీత్యా వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత హాజరుకాలేదు.

మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని నిర్ణయాలను వెల్లడించారు. వైఎస్‌ఆర్‌ ఆసరా ద్వారా డ్వాక్రా మహిళలకు రూ.6792 కోట్ల లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ఈ పథకం కోసం రూ.27,108 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు వివరించారు.

కేబినెట్ నిర్ణయాలు:

  • ఎమ్​డీవోలకు పదోన్నతులు కల్పించే అంశంపై నిర్ణయం
  • కొత్తగా డివిజనల్ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్ పోస్టుల ఏర్పాటుకు తీర్మానం
  • సెప్టెంబర్‌ 5న వైఎస్‌ఆర్‌ విద్యాకానుక పథకం అమలు
  • జగనన్న విద్యాకానుక ద్వారా 3 జతల యూనిఫామ్, బూట్లు, పుస్తకాలు
  • సెప్టెంబర్‌ 1 నుంచి వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ పథకం అమలు
  • గర్భిణులు, శిశువులకు వైఎస్ఆర్‌ సంపూర్ణ పోషణ ఆహార పథకం (30 లక్షల మందికి పౌష్టికాహారం అందించటమే లక్ష్యం)
  • డిసెంబర్‌ 1 నుంచి ఇంటింటికి నాణ్యమైన బియ్యం పంపిణీ
  • దిగువ సీలేరులో 115 మెగావాట్ల విద్యుత్ టర్బైన్ల నిర్మాణానికి ఆమోదం
  • రాయచోటిలో కొత్తగా పోలీస్ సబ్ డివిజన్‌కు ఆమోదం
  • నూతన పారిశ్రామిక విధానానికి ఆమోదం
  • ఏపీలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు కోసం ఏపీఐఐసీ ద్వారా లేఖ రాయాలని నిర్ణయం
  • కడపజిల్లా లో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు కు ఆమోదం (700 కోట్లతో ఏర్పాటు)
  • భావనపాడు పోర్టు నిర్మాణం కోసం 3600 కోట్ల పెట్టుబడి తో రైట్స్ సంస్థ ఇచ్చిన డీపీఆర్ కు ఆమోదం
  • ఏపీ సీడ్ క్వాలిటీ కంట్రోల్ యాక్టు సవరణకు ఆమోదం

ఇదీ చదవండి

పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై సుప్రీం విచారణ వాయిదా

Last Updated : Aug 19, 2020, 4:35 PM IST

ABOUT THE AUTHOR

...view details