ఆంధ్రప్రదేశ్‌కు బస్సులు పునరుద్ధరిస్తున్నట్లు కర్ణాటక ఆర్టీసీ వెల్లడించింది. ఈ నెల 17 నుంచి ఏపీకి దశలవారీగా బస్సులు నడుపుతామని తెలిపింది. అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
తొలివిడతలో నడవనున్న బస్సు సర్వీసులు
- బెంగళూరు నుంచి అనంతపురం, హిందూపురం
- బెంగళూరు నుంచి కదిరి, పుట్టపర్తి, కల్యాణదుర్గం, రాయదుర్గం
- బెంగళూరు నుంచి కడప, ప్రొద్దుటూరు, మంత్రాలయం, తిరుపతి
- బెంగళూరు నుంచి చిత్తూరు, మదనపల్లి, నెల్లూరు, విజయవాడ
- బళ్లారి నుంచి విజయవాడ, అనంతపురం, కర్నూలు, మంత్రాలయం
- రాయచూరు నుంచి మంత్రాలయం
- హపూర్ నుంచి మంత్రాలయం, కర్నూలు