ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి: కన్నా

గ్యాస్ లీకేజ్ ఘటన విషయంలో ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్​కు లేఖ రాశారు.

kanna-laxminaryana-letter-to-cm-jagan
kanna-laxminaryana-letter-to-cm-jagan

By

Published : May 11, 2020, 1:44 PM IST

సీఎం జగన్​కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో మృతి చెందిన 12 మందిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఈ ఘటన భోపాల్ గ్యాస్ లీక్ విషాదాన్ని గుర్తు తెస్తోందని తెలిపారు. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి వల్లే ప్రమాదం జరిగిందనేది వాస్తవం అని వివరించారు. కర్మాగారాన్ని తనిఖీ చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని అన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. బాధ్యులను కఠినంగా శిక్షించకపోతే ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతాయని వెల్లడించారు.

సీఎం జగన్ కు కన్నా లేఖ

ABOUT THE AUTHOR

...view details