ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'యువ న్యాయవాదులను ఆదుకోండి' - ఎంపీ కనకమేడల లేటెస్ట్ న్యూస్

లాక్​డౌన్ నేపథ్యంలో న్యాయవాదులకు 25 వేలు, క్లర్క్​లకు 15 వేలు అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ విజ్ఞప్తి చేశారు. ఉపాధి లేక కుటుంబాలను పోషించేందుకు సైతం అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

kanakamedala letter
'యువ న్యాయవాదులు దుర్భర జీవితం గడుపుతున్నారు...ఆదుకోండి'

By

Published : Mar 31, 2020, 6:33 AM IST

'యువ న్యాయవాదులు దుర్భర జీవితం గడుపుతున్నారు...ఆదుకోండి'

లాక్​డౌన్ సమయంలో రాష్ట్రంలో యువ న్యాయవాదులకు రూ.25 వేల ఆర్ధిక వెసులుబాటు కల్పించాలని రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్... ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి జగన్​కు లేఖలు రాశారు. లాక్​డౌన్ కారణంగా యువ న్యాయవాదులు, క్లర్క్స్ కు ఎలాంటి ఆదాయం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబానికి ఆహారం, ఆరోగ్య అవసరాలు సైతం తీర్చలేక దుర్భర జీవితం గడుపుతున్నారని వాపోయారు.

ఇవీ చూడండి-నిత్యావసరాల కొరత రాకుండా కంట్రోల్​ రూం ఏర్పాటు

ABOUT THE AUTHOR

...view details