రాజధాని రైతుల దీక్షకు భాజపా నేత కామినేని శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కేంద్ర నాయకత్వానికి త్వరలో తెలియజేస్తామని చెప్పారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు కోరడం న్యాయబద్ధమేనన్నారు. ఇది 29 గ్రామాల సమస్య కాదని రాష్ట్ర ప్రజల సమస్యగా భావించాలని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి.. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. నియంతృత్వం శ్రుతి మించితే వ్యవస్థలు చూస్తూ ఊరుకోవని ఆయన హెచ్చరించారు.
29 గ్రామాల సమస్య కాదు... రాష్ట్ర భవిష్యత్తు: కామినేని - latest news of kamineni
రాజధాని సమస్య 29 గ్రామాల ప్రజలది కాదని.. రాష్ట్ర ప్రజల సమస్యని భాజపా నేత కామినేని శ్రీనివాస్ అన్నారు. రాజధాని రైతుల దీక్షకు మద్దతు తెలిపిన ఆయన.. రైతుల సమస్యలను కేంద్ర నాయకత్వానికి తెలియజేస్తానని చెప్పారు. మూడు రాజధానులపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు.
దీక్షలో కుర్చున రైతులకు సంఘీభావం తెలిపిన కామినేని శ్రీనివాస్