ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో పని చేయని మంత్రి.. వెల్లంపల్లి శ్రీనివాసే: పోతిన మహేశ్ - జనసేన నేత పోతిన మహేశ్

పవన్ కల్యాణ్ గురించి మాట్లాడే అర్హత మంత్రి వెల్లంపల్లికి లేదన్నారు జనసేన నేత పోతిన మహేశ్. రాష్ట్రంలో పని చేయని మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది వెల్లంపల్లే అని ఆరోపించారు.

janasena party leader pothina mahesh
janasena party leader pothina mahesh

By

Published : Feb 8, 2022, 9:25 PM IST


మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​పై జనసేన నేత పోతిన మహేశ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పని చేయని మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది వెల్లంపల్లి శ్రీనివాసే అని ఆరోపించారు. నియోజకవర్గంలో అభివృద్ధి చేయడం చేతగాని వెల్లంపల్లి.. పవన్ కల్యాణ్ గురించి మాట్లాడితే ఆకాశం మీద ఉమ్మేసినట్టే ఉంటుందని విమర్శించారు.

రాష్ట్రంలో ఉద్యోగస్తుల సమస్యలు ఇంతవరకూ పరిష్కరించలేదని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పరిష్కరించి ఉంటే ఉపాధ్యాయులు నేటికీ ఎందుకు నిరసనలు తెలియజేస్తున్నారు సమాధానం చెప్పాలన్నారు. వైకాపా హయాంలో 150 దేవాలయాలను పాక్షికంగా ధ్వంసం చేయడం, రథాలు తగలబెట్టడం, మూడు సింహాలు మాయమవడం ఘటనలు జరిగాయని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details