ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Janasena protest: విద్యుత్​ ఛార్జీల పెంపును నిరసిస్తూ జనసేన నిరసనలు - ఏపీ తాజా వార్తలు

Janasena leaders protest: విద్యుత్​ ఛార్జీల పెంపును నిరసిస్తూ జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ పిలుపు మేరకు అన్ని కలెక్టరేట్ల ఎదుట జనసేన నేతలు నిరసనలు చేపట్టారు. విద్యుత్ ఛార్జీలపై ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం సాగిస్తుందని స్పష్టం చేశారు. కాకినాడ కలెక్టరేట్‌ సమీపంలోని ధర్నాచౌక్‌ వద్ద జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ ధర్నా నిర్వహించారు. విజయవాడలో నిరసనకు దిగిన మహేశ్​ విద్యుత్​ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్​ చేశారు. వైకాపా గుర్తైన ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

Janasena leaders protest
జనసేన నేతల నిరసనలు

By

Published : Apr 1, 2022, 2:29 PM IST

Janasena leaders protest: రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట జనసేన నేతలు విద్యుత్​ ఛార్జీల పెంపుపై నిరసనలు చేపట్టారు. కాకినాడ కలెక్టరేట్‌ సమీపంలోని ధర్నాచౌక్‌ వద్ద జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ నేతృత్వంలో ఆందోళన నిర్వహించారు. కాకినాడ జడ్పీ కూడలి నుంచి నాదెండ్ల మనోహర్‌ నిరసన ప్రదర్శన చేపట్టారు.

Janasena leaders protest: విజయవాడలోనూ జనసేన నాయకులు ఆందోళన, నినాదాలు చేశారు. విద్యుత్‌ ఛార్జీల పెంపుతో ఇళ్లలో ఫ్యాన్లు వేసుకునే పరిస్థితి లేదంటూ.. విసనకర్రలతో నిరసన తెలిపారు. దేశంలో ఎక్కడా లేని‌విధంగా కరెంటు ఛార్జీలు వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు వైకాపా గుర్తైన ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

Janasena leaders protest: విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. 'జగన్.. బాదుడే బాదుడు' అంటూ ప్రజలపై భారం మోపారని జనసేన నేత పోతిన మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపుతో పాటు ట్రూ అప్ ఛార్జీలు పెంచారని మండిపడ్డారు. విద్యుత్‌ ఛార్జీల పెంపు వేసవిలోనే గుర్తుకొస్తుందా? అని ప్రశ్నించారు. పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలను చీకటిమయం చేశారని పోతిన మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యుత్​ ఛార్జీల పెంపుపై జనసేన నేతల నిరసనలు
ఇదీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details